iDreamPost
android-app
ios-app

బాలయ్యతో చేసేది కామెడీ సినిమా కాదు.. అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా కథ ఇదే..

  • Published May 22, 2022 | 5:29 PM Updated Updated May 22, 2022 | 5:29 PM
  • Published May 22, 2022 | 5:29 PMUpdated May 22, 2022 | 5:29 PM
బాలయ్యతో చేసేది కామెడీ సినిమా కాదు.. అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా కథ ఇదే..

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు. అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొద్దిగా గ్యాప్ తీసుకొని బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా పూర్తయ్యేలోపు తన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తా అంటున్నాడు అనిల్ రావిపూడి.

F3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో తీయబోయే సినిమా గురించి, కథ గురించి చెప్పేసాడు అనిల్ రావిపూడి. అనిల్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో తీసేది కామెడీ సినిమా కాదు. తండ్రి-కూతురు మధ్య నడిచే కథ ఇది. తండ్రిగా బాలకృష్ణ, కూతురుగా శ్రీలీల కనిపిస్తారు. బాలయ్య బాబు ఇందులో కాస్త వయసు మళ్లిన పాత్రలో కనిపిస్తారు. సినిమా మొత్తం బాలయ్య బాబు గారి మీదే నడుస్తుంది. పోకిరి, గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి.. ఇలాంటి సినిమాలన్నీ హీరోల క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతాయి. ఈ సినిమా కూడా బాలకృష్ణ క్యారెక్టర్ మీదే నడుస్తుంది.

బాలకృష్ణ 50 ఏళ్ల వయసున్న ఓ తండ్రి పాత్ర చేయనున్నారు. కథ ఫైనల్ అయింది. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. F3 సినిమా రిలీజ్ అయ్యాక బాలకృష్ణ గారి సినిమా స్క్రిప్ట్ మొదలు పెడతాను. బాలయ్యను నేను వేరే కోణంలో చూస్తున్నాను. ఆ కోణంలో అభిమానులకి చూపిస్తాను. సినిమా రిలీజయ్యాక బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అని అడుగుతారు. బాలయ్య స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్ ఏవి కూడా మిస్ అవ్వవు అని తెలిపారు.

బాలయ్యబాబు కోసం నా కామెడీ మార్క్ ని పక్కన పెట్టి ప్రయోగం చేస్తున్నాను, నా కెరీర్ లో బెస్ట్ వర్క్ గా బాలకృష్ణ సినిమా ఉంటుందని అన్నారు అనిల్ రావిపూడి. దీంతో బాలయ్య బాబు అభిమానులు ముందుగానే ఈ సినిమా మీద హైప్ పెంచేసుకుంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss