iDreamPost
android-app
ios-app

అమరావతి మహిళలపై పోలీసుల ప్రతాపం

అమరావతి మహిళలపై పోలీసుల ప్రతాపం

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, రాష్ట్రానికి ఒక్క రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతిలో ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపారు. రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామ కూడలిలో ఈ రోజు 17వ రోజు రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. సకల జనుల సమ్మెకు పూనుకున్న మందడం, తూళ్లురు గ్రామ ప్రజలు ఆయా గ్రామాల్లోని దుకాణాలను బంద్‌ చేయించారు. గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.

సచివాలయానికి వెళ్లే మార్గం కావడంతో మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో మహిళలకు, పోలీసు మహిళా కానిస్టేబుళ్లకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ పట్ల మహిళా పోలీసులు దారుణంగా వ్యవహరించారంటూ మహిళలు వాపోయారు. పోలీసు వాహనం ముందుకు కదలకుండా రైతులు వాహనాలను అడ్డుకున్నారు. అయితే వారిని తప్పించిన పోలీసులు మహిళలను స్టేషన్‌కు తరలించారు.