iDreamPost
android-app
ios-app

‘పుష్ప-2’ తర్వాత సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ మూవీ!

  • Published Dec 28, 2022 | 10:43 AM Updated Updated Dec 19, 2023 | 4:53 PM

ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం.

ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం.

  • Published Dec 28, 2022 | 10:43 AMUpdated Dec 19, 2023 | 4:53 PM
‘పుష్ప-2’ తర్వాత సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ మూవీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2014లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. అందుకే బన్నీ, సురేందర్ రెడ్డి కలయికలో మరో సినిమా వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వారిలో ఎప్పటినుంచో ఉంది. అయితే ఇంతకాలానికి అభిమానుల ఆశ నెరవేరే సమయం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. తొమ్మిదేళ్ల తర్వాత బన్నీ, సురేందర్ రెడ్డి మరోసారి చేతుల కలపబోతున్నారని తెలుస్తోంది.

గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తగ్గేదేలే అంటూ ఎక్కడ చూసినా బన్నీ పేరు మారుమోగి పోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప-2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే చిత్రం గురించి టాలీవుడ్ లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. పుష్ప-2 తర్వాత బన్నీ నటించే సినిమాకి ఈయనే దర్శకుడు అంటూ ఇప్పటిదాకా త్రివిక్రమ్ సహా పలువురి పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా సురేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

సురేందర్ రెడ్డి ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఏజెంట్’ తర్వాత సురేందర్ రెడ్డి చేయబోయే సినిమాపై ఇంతవరకు స్పష్టత లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది. కానీ ప్రస్తుతం పవన్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా అది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాల్లేవు. అలాగే నితిన్ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కలయికలో రెండో సినిమా అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బన్నీ కోసం సురేందర్ రెడ్డి టీమ్ ఓ మంచి కథని రెడీ చేసే పనిలో ఉందట. పుష్ప-2 తర్వాత బన్నీ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడట. అందుకే తన తదుపరి చిత్ర దర్శకుడిగా సురేందర్ రెడ్డిని ఎంపిక చేసుకున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom