iDreamPost
android-app
ios-app

పుష్పరాజ్ కథ 2 భాగాలు కాదు

  • Published Jul 19, 2022 | 5:33 PM Updated Updated Jul 19, 2022 | 5:33 PM
  • Published Jul 19, 2022 | 5:33 PMUpdated Jul 19, 2022 | 5:33 PM
పుష్పరాజ్ కథ 2 భాగాలు కాదు

అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ ప్రస్తుతం ఆడిషన్లు జరుగుతున్నాయి. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ లాగా కేవలం ఏడాది గ్యాప్ లో ఈ డిసెంబర్ లో పుష్ప 2 వచ్చే ఛాన్స్ లేదు. 2023 వేసవి లేదా అంతకన్నా ఆలస్యంగా రిలీజవ్వొచ్చేమో కానీ ముందు వచ్చే సూచనలు మాత్రం లేవు. అందులోనూ కెజిఎఫ్ తో పోలుస్తూ మరీ హైప్ పెంచుతున్నారు కాబట్టి నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరీ జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.

అందరూ అనుకుంటున్నట్టు పుష్ప 2 ది రూల్ తో ఈ కథను ముగించడం లేదట. సుకుమార్ కు మూడో భాగం ప్లాన్ కూడా ఉందని విలన్ గా నటించిన ఫహద్ ఫాసిల్ చెప్పడం ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో చర్చకు దారి తీసింది. ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఇలా మూడో కొనసాగింపు వచ్చిన సినిమా ఏదీ లేదు. మనీ, బాహుబలి మాత్రమే కంటిన్యూగా రెండు భాగాలు వచ్చాయి. కిక్, గబ్బర్ సింగ్, మన్మథుడు తదితరాలన్నీ మూల కథతో సంబంధం లేకుండా కేవలం టైటిల్ క్రేజ్ ని క్యాష్ చేసుకున్నవి. ఇప్పుడు పుష్ప 3 కనక కార్యరూపం దాలిస్తే అదో రికార్డు అవుతుంది. దీనికి సంబంధించిన నిర్ణయం బన్నీ సుక్కులు ఫైనల్ గా తీసుకున్నారో లేదో తెలియదు

ఒకవేళ నిజమైతే మాత్రం మంచి ఎగ్జైటింగ్ న్యూస్ అవుతుంది. వాస్తవానికి సుకుమార్ పుష్పని వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనతో రాసుకున్నాడు. ఎపిసోడ్స్ ఎక్కువగా అవసరమవుతాయి కాబట్టి దానికి తగ్గట్టే డ్రామాని క్రియేట్ చేశారు. కానీ అల్లు అర్జున్ విన్నాక దీని స్వరూపమే మారిపోయింది. సినిమాగా తీయమని ప్రోత్సహించి గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఉత్తరాది వాళ్లలో బాగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు. పుష్ప 3 అంటే మాత్రం మళ్ళీ ఆది ఏ 2024లోనో వస్తుంది. అప్పటిదాకా బన్నీ హెయిర్ స్టైల్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాడా లేక పుష్ప 2తోనే సరిపెడదామని నో అంటాడా చూడాలి. ఫాహద్ ఫాసిల్ మాత్రం వస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet