iDreamPost
android-app
ios-app

ఆ దేశాలకు ఎయిర్ ఇండియా ప్ర‌యాణీకుల‌కు బుకింగ్‌ను ప్రారంభం

  • Published May 18, 2020 | 4:54 AM Updated Updated May 18, 2020 | 4:54 AM
ఆ దేశాలకు ఎయిర్ ఇండియా ప్ర‌యాణీకుల‌కు బుకింగ్‌ను ప్రారంభం

మే 20 సాయంత్రం 5 గంట‌ల నుండి రిజ‌ర్వేష‌న్లు ప్రారంభం

దేశీయ విమానాల పునః ప్రారంభించిన దేశాలకు ఎయిర్ ఇండియా ప్ర‌యాణీకుల‌కు బుకింగ్‌ను ప్రారంభించింది. అయితే
విమానం ఎక్కే సమయంలో ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. క‌రోనా లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే విమానంలో ఎక్కడానికి అనుమతించబడతారు. కొనసాగుతున్న లాక్ డౌన్‌ మధ్య అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, ఫ్రాంక్ఫర్ట్, పారిస్ మరియు సింగపూర్ తో సహా మరో ఆరు దేశాలకు భారతదేశం నుండి నడుపుతున్న విమానాలపై ఎయిర్ ఇండియా బుకింగ్స్ తెరిచింది. వందే భారత్ మిషన్ రెండో దశలో ఈ దేశాల ప్ర‌యాణికుల‌కు మాత్రమే అవుట్‌బౌండ్ విమానాలలో ప్రయాణించడానికి అనుమతించబడతారు. ఏదేమైనా ఈ విమానాల్లో ఆ దేశం నిర్దిష్ట వ్యవధికి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న వ్యక్తులు కూడా అనుమతించబడతారు. అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, ఫ్రాంక్ఫర్ట్, పారిస్, సింగపూర్ ల‌కు త‌మ‌ గమ్యస్థానాలను ఎంచుకోవడానికి భారతదేశం నుండి ప్రయాణానికి రిజర్వేషన్లు మే 20 సాయంత్రం 5 గంట‌ల నుండి ప్రారంభమవుతాయి.

మే 16 నుండి 22 వ‌ర‌కు దాదాపు 30 వేల మంది విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయులు రానున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్‌ మధ్య చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మే 7న వందే భారత్ మిషన్ ప్రారంభించింది. ఈ అవుట్‌బౌండ్ విమానాలలో సీట్లు బుక్ చేసుకోవడానికి విదేశీ పౌరులు, చెల్లుబాటు అయ్యే వీసాదారులకు ఇది అనుమతి ఇచ్చింది. ఈ మిషన్ మొదటి దశలో ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మే 7 నుండి మే 14 మధ్య 12 దేశాల నుండి 64 విమానాల్లో 14,800 మంది భారతీయులను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చారు. రెండో ద‌శ‌లో మే 16 నుంచి మే 22 మధ్య 149 విమానాల్లో 31 దేశాల నుంచి 30,000 మంది భారతీయులు స్వ‌దేశానికి వ‌స్తార‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. “మే 16 నుండి 22 వరకు వందే భారత్ రెండో దశలో అమెరికా, ఆస్ట్రేలియా, బెలారస్, కెనడా, ఫ్రాన్స్, జార్జియా, జర్మనీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, క‌జాఖ‌స్తాన్‌, కిర్గిజ్స్తాన్, నేపాల్, నైజీరియా, రష్యా, తజికిస్తాన్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్ దేశాల నుండి విమానాల్లో భార‌తీయులు రానున్నార‌ని తెలిపారు.