iDreamPost
android-app
ios-app

హిట్ 2 బిజినెస్ కి మేజర్ సహాయం

  • Published Jun 14, 2022 | 2:19 PM Updated Updated Jun 14, 2022 | 2:20 PM
  • Published Jun 14, 2022 | 2:19 PMUpdated Jun 14, 2022 | 2:20 PM
హిట్ 2 బిజినెస్ కి మేజర్ సహాయం

అడవి శేష్ కెరీర్లోనే మేజర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కలెక్షన్లు నెమ్మదించినా ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 కోట్లు దాటేయడంతో ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ సాధించుకుంది. దేశభక్తి ప్రధానాంశంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ పాట్రియాటిక్ డ్రామాకు పవన్ కళ్యాణ్, చిరంజీవిలు మద్దతు తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిర్మాత మహేష్ బాబు వీటిని రీ ట్వీట్ చేయడం ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. మేజర్ ఇకపై రాబట్టుకునే మొత్తం భారీగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా విక్రమ్ తాకిడి బలంగా ఉండటంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం.

ఇప్పుడీ మేజర్ సక్సెస్ ఎఫెక్ట్ నేరుగా హిట్ 2 మీద పడనుంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మంచి విజయం సాధించిన సంగతి గుర్తే. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఆ క్రైమ్ థ్రిల్లర్ నిర్మాతగా నానికి మంచి లాభాలు ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే హిట్ 2 ది సెకండ్ కేస్ ని శేష్ తో తీశారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. జులై 29 విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ తీసిన శైలేష్ కోలనే దీనికీ దర్శకుడు. భారీగేమీ ఖర్చు పెట్టకుండా సేఫ్ గేమ్ తో త్వరగా పూర్తి చేశారు. ఇప్పుడు మేజర్ పుణ్యమాని శేష్ కి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది కాబట్టి హిట్ 2ని సులభంగా ప్యాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ చేసుకోవడానికి అవకాశం దక్కింది.

అంటే సుందరానికి ఫలితం బ్లాక్ బస్టర్ దిశగా లేకపోవడంతో ఒకింత నిరాశగా ఉన్న నానికి హిట్ 2 సినిమా నిర్మాతగా ప్లస్ అయ్యేలా ఉంది. కంటెంట్ యావరేజ్ ఉన్నా చాలు పాస్ అయిపోతుంది. మేజర్ విజయం ఇలా శేష్ కు అన్నిరకాలుగా ఉపయోగపడుతోంది. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సెలెక్టివ్ మూవీస్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న అడవి శేష్ కమర్షియల్ మూవీస్ మాత్రం చేయనంటున్నాడు. ఇది మంచి నిర్ణయం. తనలాంటి యూత్ హీరోలు క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అన్నట్టు గూఢచారి 2 కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఇంకో నెల రోజుల్లో డేట్ ప్రకటించవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet