హిట్ 2 ఓటిటిలో వచ్చేసింది కానీ …

అదేంటో అమెజాన్ ప్రైమ్ కొత్త సినిమాల ప్రీమియర్లకు విచిత్రమైన స్ట్రాటజీలు ప్లే చేస్తోంది. గత నెల విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ లైవ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అయితే ఇక్కడో ట్విస్టు పెట్టారు. అదేమీ ఊహించనది కాదు లెండి. 129 రూపాయలకు రెంటు పెట్టి చూడమన్నారు. జనవరి 6 నుంచి సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఫ్రీగా చూసేయొచ్చు. అయినా మూడు రోజుల సంబరానికి డబ్బులు అడగటం ఏమిటో అంతు చిక్కడం లేదు. పోనీ అదేమైనా ఒకటి రెండు వారాల క్రితం రిలీజైన సినిమా అయితే ఏదో అనుకోవచ్చు. ఆల్రెడీ నెల దాటేసింది. అన్ని చోట్లా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. మెయిన్ సెంటర్స్ లో తప్పించి ధమాకాతో రీప్లేస్ అయ్యింది

గతంలో కెజిఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్ 1లకు ఇలాంటి మోడల్ అమలు పరిచిన ప్రైమ్ వాటి విషయంలో ఇంత తక్కువ గ్యాప్ ఇవ్వలేదు. కానీ హిట్ టూకి ఇలా చేయడం విచిత్రమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇందులో ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. అడవి శేష్ కు ఒకే ఏడాదిలో మేజర్ తర్వాత రెండో విజయం ఈ సినిమా. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సైకో కిల్లింగ్ కాన్సెప్ట్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న దర్శకుడు శైలేష్ కొలను లైన్ పరంగా మరీ కొత్తగా తీసుకోకపోయినా టేకింగ్ పరంగా మెప్పించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం దక్కింది. ఇలాంటి వాటికి ఓటిటిలో వచ్చే స్పందన ఎక్కువగా ఉంటుంది

నెట్ ఫ్లిక్స్ దూకుడు పెంచాక ప్రైమ్ కొంచెం నెమ్మదించిన మాట వాస్తవం. గత ఏడాది కాలంలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, శ్యామ్ సింగ రాయ్ లాంటి పెద్ద సినిమాలన్నీ అమెజాన్ చేయి జారాయి. ఆర్ఆర్ఆర్ జీ5 తీసుకుంటే హిందీ వెర్షన్ మాత్రమే కొనుక్కుని నెట్ ఫ్లిక్స్ పండగ చేసుకుంది. అందుకే ప్రైమ్ కొత్త ప్లానింగ్ తో వెళ్తోంది. ఇటీవలే యశోదకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెంటల్ విధానం మన దేశంలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఏడాది మొత్తానికి చందా కట్టాక మళ్ళీ ఈ తిరకాసు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే హాలీవుడ్ బాలీవుడ్ కి మినహాయించి దక్షిణాది చిత్రాలకు దీన్ని ఎక్కువగా అమలు పరచడం లేదు

Show comments