Kartikeya 2 కార్తికేయ 2 ఒక అడుగు వెనక్కు – మూడో భాగం కూడా

విడుదలకు సిద్ధమైనప్పటి నుంచి కార్తికేయ 2 పడుతున్న కష్టాలు చూస్తూనే ఉన్నాం. హీరో నిఖిల్ స్వయంగా తనకు కన్నీరు వచ్చినంత పనైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో మలుపు వచ్చి పడింది. ముందు చెప్పినట్టు ఆగస్ట్ 12 కాకుండా ఒక రోజు ఆలస్యంగా 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. థియేటర్ కౌంట్ విషయంలో తలెత్తిన పలు ఇబ్బందులతో పాటు ఒక రోజు ఆగడం వల్ల నేరుగా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంలతో ఢీ కొట్టే ముప్పు తప్పుతుంది కాబట్టి ఆ మేరకు కార్తికేయ 2 నిర్ణయం మార్చుకున్నట్టుగా సమాచారం.

అన్నట్టు కార్తికేయ 3 కూడా ఉందట. మూడో భాగం గ్రీస్ దేశంలో జరిగేలా దర్శకుడు చందూ మొండేటి కథను సిద్ధం చేశారట. అంటే సెకండ్ పార్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఈ మాట అనలేరు. అయితే టాలీవుడ్ లో నెంబర్ 2 మీదున్న నెగటివ్ సెంటిమెంట్ కి ఈ కార్తికేయ ఎలా బ్రేక్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే కథకు కొనసాగింపు కాకుండా మూల కథతో సంబంధం లేకుండా తీసినవన్నీ తెలుగులో అంతగా ఆడలేదు. కిక్ 2, మన్మథుడు 2, గాయం2, సత్య 2, ఆర్య 2 ఇవన్నీ డిజాస్టర్లే. ఎఫ్3 ఒకటే దీనికి ఎదురీది చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. బాహుబలి, కెజిఎఫ్ లు ఒరిజినల్ సీక్వెల్స్ కాబట్టి వాటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు.

సో కార్తికేయ ఒక రోజు లేదా వారం ఆలస్యం అయినా కంటెంట్ బాగుంటే వచ్చే ఇబ్బందులేవీ ఉండవు. కాకపోతే కాంపిటీషన్ టఫ్ గా ఉంది. జనం థియేటర్లకు అంత ఈజీగా కదలడం లేదు. కార్తికేయ 2 ఎలాగూ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. జనం డిమాండ్ చేసే విజువల్ గ్రాండియర్, గ్రాఫిక్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పైగా శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ కూడా జోడించారు. సానుకూలతలు బలంగానే కనిపిస్తున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల అనుపమ పరమేశ్వరన్ పాల్గొనలేకపోయినా నిఖిల్ మొత్తం తన భుజాల మీదే వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఈ ఏడాదిలోనే నిఖిల్ తర్వాతి సినిమాలు స్పై, 18 పేజెస్ విడుదల కాబోతున్నాయి.

Show comments