iDreamPost
android-app
ios-app

Actor Nani: వేణుతో నాని సినిమా! న్యాచురల్ స్టార్ తెగ నచ్చేశావ్ బాస్!

  • Published Dec 05, 2023 | 4:40 PM Updated Updated Dec 05, 2023 | 4:40 PM

నాని ఎంపిక చేసుకున్న కథల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్లను అందుకుంటున్నాడు. ఈ ఏడాది విడుదలైన దసరా మూవీ మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హాయ్ నాన్న అంటూ పలకరించబోతున్నాడు.

నాని ఎంపిక చేసుకున్న కథల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్లను అందుకుంటున్నాడు. ఈ ఏడాది విడుదలైన దసరా మూవీ మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హాయ్ నాన్న అంటూ పలకరించబోతున్నాడు.

  • Published Dec 05, 2023 | 4:40 PMUpdated Dec 05, 2023 | 4:40 PM
Actor Nani: వేణుతో నాని సినిమా! న్యాచురల్ స్టార్ తెగ నచ్చేశావ్ బాస్!

ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. కానీ, దానిని గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చే గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులోను తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలను దక్కించుకోవడం అత్యంత కష్టతరం. ప్రతిభతో పాటు పట్టుదల, ఓర్పుతో ఉండగలిగితేనే సినిమా రంగంలో రాణించగలుగుతారు. అలా కష్టపడి వచ్చిన వారిలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో.. హీరో ‘నాని’ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చేందుకు ఎప్పుడూ ముందుంటాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంతో శౌర్యువ్ అనే నూతన దర్శకుడిని.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో హీరో నాని తాజాగా తన తర్వాత ప్రాజెక్ట్ కోసం ‘బలగం’ చిత్ర దర్శకుడు ‘వేణు’ తో కలిసి పనిచేసేందుకు.. ఆసక్తిగా ఉన్నానంటూ చేసిన ట్వీట్  నెట్టింట వైరల్ అవుతోంది.

ఎటువంటి సినీ బాగ్రౌండ్ లేకుండా స్వతహాగా తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి నాని. అతని పక్కింటి అబ్బాయిల కనిపించే లుక్స్ , వైవిధ్య భరితమైన నటన, అతని సహజ స్వభావం ఒక సాధారణ నానిని.. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానిగా మార్చేశాయి. ఈ హీరో చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన నాటినుంచి అతని కథల ఎంపిక సరికొత్తగా ఉంటుంది. కథల విషయంలో నాని ప్రత్యేక శ్రద్ద వహిస్తాడు. అందులోను కొత్త దర్శకులతో పనిచేయడానికి నాని ఏ మాత్రం సంకోచించడు. ఇక తాజాగా ‘హాయ్ నాన్న’ చిత్రంతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని కూడా నాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అయితే తన చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా.. ట్విట్టర్ లో #Ask Nani అంటూ గంట పాటు తన అభిమానులతో ముచ్చటించాడు నాని. ఈ క్రమంలో ఓ వ్యక్తి ‘మీరు పని చేయాలనుకుంటున్న రాబోయే దర్శకుడు ఎవరు?’ అనే ప్రశ్నను సంధించాడు. అయితే నాని ఆ ప్రశ్నకు సమాధానంగా “వేణు(బలగం)” అని ట్వీట్ చేశాడు. దీనితో నెటిజన్లు రకరకాలుగా స్పదించడం మొదలుపెట్టారు.

కాగా మొదట కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు వేణు. ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2023లో విడుదలైన ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ఎన్నో అవార్డ్స్ ను తన సొంతం చేసుకున్నాడు ‘వేణు యెల్దండి’. ‘బలగం’ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవిత పరిశీలన నుంచి సేకరించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు ఈ దర్శకుడు. తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు వేణు. అయితే బలగం తర్వాత ఇతను తన రెండవ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో తెలిపాడు. ఇక ఇప్పుడు నాని తాజాగా దర్శకుడు వేణు పేరును ట్వీట్ చేయడంతో అభిమానులలో ఆసక్తి పెరిగింది. అయితే, నాని హీరోగా నటించిన ‘పిల్ల జమిందార్’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు వేణు. ఇక ఇపుడు నాని అతనితో దగ్గర పని చేయాలి అనుకోవడం సాధారణ విషయం కాదు. చిన్న డైరెక్టర్స్ ను, కొత్త వారిని నాని ప్రతిసారి ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఇక నాని చేసిన ఈ ట్వీట్ మీద అభిమానులు న్యాచురల్ స్టార్ తెగ నచ్చేశావ్ బాస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సాధారణంగా కొన్ని ఇంటర్వూస్ లో కూడా నాని.. కొత్త దర్శకుల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ‘పెద్ద దర్శకులతోనే పని చేద్దామనుకుంటే పనులు అవ్వవు. మనకున్న పరిధిలో ప్రతిభావంతులైన వారితో పనిచేయాలి. కొన్నాళ్ల క్రితం నేను కొత్తవాడినే అందరూ సపోర్ట్‌ చేస్తేనే కదా, నేను ఇక్కడిదాకా వచ్చాను’ అని వినయంగా చెప్తూ ఉంటాడు నాని. ఏదేమైనా కొత్త దర్శకులతో అద్భుతమైన చిత్రాలను తెరపైకి తీసుకురావడం న్యాచురల్ స్టార్ నానికి మాత్రమే సాధ్యం. ఇక హీరో నాని చేసిన ట్వీట్ మీద దర్శకుడు వేణు ఎలా స్పదింస్తాడో వేచి చూడాలి. కాగా, ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో ఇప్పటికే ఓ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాని..డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోసారి అందరి హృదయాలను దోచుకోనున్నాడు. మరి నాని.. దర్శకుడు వేణు గురించి చేసిన ట్వీట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom