మరోసారి వైసీపీదే విజయం.. సంచలన విషయాలు వెల్లడించిన ఆరా మస్తాన్

Reasons Behind YCP To Be Success: మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా మస్తాన్ సర్వేలో వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుండడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Reasons Behind YCP To Be Success: మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా మస్తాన్ సర్వేలో వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుండడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆరా మస్తాన్ సర్వే అంటే తెలుగు రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన సర్వేలో వెల్లడించే విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని ఒక నమ్మకం. తాజాగా జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో సంచలన విషయాలు వెల్లడించారు. మరోసారి వైసీపీదే విజయం అని.. దానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. సంక్రాంతి నాటికే అభ్యర్థులను ప్రకటించడం, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతే.. ప్రతిపక్ష కూటమి మాత్రం సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థులను నిలబెట్టాలన్న విషయంలో నామినేషన్స్ వరకూ తడబడ్డారని అన్నారు.

కరోనా మినహాయిస్తే.. మిగతా సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన నూతన విధానాలు వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆరా మస్తాన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకూ ప్రభుత్వ సేవలను చేర్చడం వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించబోతుందని అన్నారు. 71 శాతం గ్రామీణ ప్రజానీకం ఉన్న ఏపీలో ఏ గ్రామంలో అయినా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ది పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా గ్రామ స్థాయి లేదా మండల స్థాయి నాయకుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చిన వైనాన్ని ఈ ప్రజలు అభినందించారని అన్నారు.

వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచిందని.. అందులో ఏ మాత్రం సందేహం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ని 3 వేలకు పెంచి ఇవ్వడం, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారన్న భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగడం కూడా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. రెండు నెలలకొకసారి, మూడు నెలలకొకసారి మహిళల ఖాతాల్లో వేలాది రూపాయలు వైసీపీ ప్రభుత్వం జమ చేయడం కూడా వైసీపీకి ప్లస్ అవుతుందని అన్నారు. 56 శాతం మంది మహిళలు జగన్ ని మరోసారి గెలిపించుకోవడానికి ఓట్లు వేశారని ఆరా మస్తాన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు సహా అన్ని వర్గాలకు చెందిన మహిళలు మొత్తం 56 శాతం మంది వైసీపీకి ఓట్లు వేశారని అన్నారు. కేవలం 42 శాతం మంది మహిళలు మాత్రమే టీడీపీ కూటమికి ఓటు వేశారని అన్నారు.

56 శాతం మగవాళ్ళు కూటమికి ఓట్లు వేయగా.. మిగతా 44 శాతం వైసీపీకి ఓటు వేశారని అన్నారు. అయితే ఈసారి మగాళ్లతో పోలిస్తే మహిళలు 1.43 శాతం అధికంగా ఓట్లు వేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళల జనాభా పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఉండడం వైసీపీకి విజయం తెచ్చిపెట్టనుందని అన్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం.. వారికి లబ్ది చేకూర్చే పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం.. వాలంటీర్ వ్యవస్థ లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వంటివి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఆరా మస్తాన్ సర్వే ఇప్పటి వరకూ ఫెయిల్ అవ్వలేదు. ఆయన సర్వేలకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో మరోసారి వైసీపీ అధికారం చేపట్టబోతుందన్న ధీమాతో వైసీపీ శ్రేణులు ఉన్నారు.  

Show comments