iDreamPost
android-app
ios-app

చిరు సినిమాలో వర్సటైల్ యాక్టర్

  • Published Jun 30, 2021 | 11:46 AM Updated Updated Jun 30, 2021 | 11:46 AM
చిరు సినిమాలో వర్సటైల్ యాక్టర్

విలక్షణ నటుడిగా బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నవాజుద్దీన్ సిద్ధిక్ సౌత్ ఎంట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ పేటతో జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ తమిళంలో తన పాత్రకు యాక్టింగ్ కి మంచి స్పందన దక్కింది. విజయ్ సేతుపతిని ఓవర్ టేక్ చేసి మరీ నవాజ్ మెప్పించిన తీరు ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఇతన్ని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అది కూడా ఏదో ఆషామాషీ సినిమాలో కాదు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే మాస్ ఎంటర్ టైనర్ లో ఓ కీలక పాత్ర కోసం నవాజ్ ని ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం.

ఇంకా కథ చెప్పడం దాకా వెళ్ళలేదు కానీ త్వరలో బాబీ నవాజ్ కి నెరేషన్ ఇస్తాడట. అతను ఓకే చెప్తాడా లేదా అనేది రకరకాల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. నవాజ్ ని ఒప్పించడం కష్టమేమి కాదు. సబ్జెక్టులో దమ్ముండాలి. ఈజీగా ఎస్ చెప్పేస్తాడు. అందులోనూ చిరంజీవి మూవీ కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే చరణ్ సహాయంతో సల్మాన్ ఖాన్ రికమెండేషన్ చేయించవచ్చు. ఇదంతా కథ నచ్చి డేట్లు దొరక్క ఇబ్బంది పడితేనే ట్రై చేయొచ్చు. త్వరలోనే ముంబైలో దీనికి సంబంధించిన సిట్టింగ్ కోసం బాబీ ఇప్పటికే ప్లానింగ్ చేసుకున్నాడట

ఇది ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఆచార్య రెండు వారాల బాలన్స్ షూటింగ్ పూర్తయ్యాక లూసిఫర్ రీమేక్ మొదలుపెట్టాలి. దర్శకుడు మోహన్ రాజా ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశారు. ఇది ఎంత లేదన్నా అయిదారు నెలలు షూట్ జరుగుతుంది. ఆ తర్వాత కానీ బాబీ ప్రాజెక్టు లైన్ లోకి రాదు. సో నవాజుద్దీన్ డేట్లు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయొచ్చు. రాబోయే ఏడాది కాలంలో చిరంజీవి మొత్తం మూడు సినిమాలు పూర్తి చేసే ప్రణాళికలో ఉన్నారు. ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఆచార్య ఈపాటికే రిలీజైపోయి లూసిఫర్ కూడా స్పీడ్ లో ఉండేది. అంతే టైం ఎవరి చేతుల్లో లేదు కదా.