iDreamPost
android-app
ios-app

కారు ఇంజన్ నుంచి వింత శబ్ధాలు.. బోనెట్ తెరిచి చూడగా..!

కారు ఇంజన్ నుంచి వింత శబ్ధాలు.. బోనెట్ తెరిచి చూడగా..!

ఢిల్లీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసి ఉంచిన ఓ కారు ఇంజన్ నుంచి వింత శబ్దాలు వచ్చాయి. వెంటనే కొందరు వ్యక్తులు అప్రమత్తమై ఆ కారు బోనెట్ తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే? ఢిల్లీలోని చిత్తరంజాన్ పార్క్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి కారు పార్క్ చేసి ఉంచాడు. అయితే తాజాగా అదే కారు ఇంజన్ నుంచి ఉన్నట్టుండి వింత శబ్ధాలు వచ్చాయి. ఇక అంతా అక్కడికి చేరుకుని కారు బోనెట్ తెరిచి చూడగా.. అందులో భారీ పైథాన్ అందులో సేద తీరుతూ కనిపించింది. ఆ పామును చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

వెంటనే ఎన్జీఓ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది.. సుమారు 30 నిమిషాల పాటు కష్టపడి ఎట్టకేలకు కారు ఇంజన్ నుంచి ఆ పామును బయటకు తీశారు. ఆ తర్వాత ఆ పామును అటవీ శాఖ అధికారులకు ముట్టజెప్పారు. అయితే ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి