iDreamPost

ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఊహించని దృశ్యం.. ప్రయాణికుడు షాక్!

  • Published Jun 08, 2024 | 7:05 PMUpdated Jun 08, 2024 | 7:05 PM

ఈ మధ్య ఆన్ లైన్ , రెస్టారెంట్స్ లో కానీ విక్రయించే ఫుడ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా రైళ్లలో ప్రయాణించే ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేయగా.. అందులో కనిపించే దృశ్యలు చూసి షాక్ గురయ్యాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఈ మధ్య ఆన్ లైన్ , రెస్టారెంట్స్ లో కానీ విక్రయించే ఫుడ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా రైళ్లలో ప్రయాణించే ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేయగా.. అందులో కనిపించే దృశ్యలు చూసి షాక్ గురయ్యాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 08, 2024 | 7:05 PMUpdated Jun 08, 2024 | 7:05 PM
ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఊహించని దృశ్యం.. ప్రయాణికుడు షాక్!

ఇటీవల కాలంలో ఫుడ్ లవర్స్ కు ఊహించని షాక్ తగులుతున్నాయి. ఎందుకంటే.. ఈ మధ్య ఆన్ లైన్ ఫుడ్ కానీ, స్టార్ హోటల్స్,రెస్టారెంట్లలో కానీ నాణ్యత లేని కల్తీ ఫుడ్ ను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా.. కుల్లిపోయిన, బూజి పట్టిన మాంసం, గడువు తీరిన ఆహార పదార్థలను విక్రయించడం,  శుభ్రత లేని పాత్రలను ఉపాయోగించడం వంటివి చేస్తూ..  అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. దీంతో ఇప్పటికే నగరంలో ఎక్కడపడితే అక్కడ ఉన్న పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సెప్టీ ఆఫిసర్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ రెస్టారెంట్ల బాగోతం ఒక్కొక్కటి బయట పడుతుంది.

అంతేకాకుండా..  పలు రెస్టారెంట్స్ లో పైకి  మంచిగా కనిపించే  ఆహార పదార్థల్లో కూడా  బొద్దింకలు, బల్లులు, పాములు జంతువులు వంటివి దర్శనమిస్తున్నాయి. దీంతో బయట ఫుడ్ తింటే ప్రాణాలకే ముప్పు అంటూ ప్రజలు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రైల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఆ ప్రయాణికుడు తనకు ఎదరుైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇంతకి ఏం జరిగిందంటే.. సాధారణంగా ఇంట్లో ఎక్కడైనా బొద్దికంను చూస్తేనే చాలు భయపడతాం. ఇక మరికొందరు వాటిని చూస్తే చిరాకు పడతారు. అలాంటిది మనం తినే ఫుడ్ లోనే బొద్దింక కనిపిస్తే.. దాన్ని వర్ణించడం చాలా కష్టం. ముఖ్యంగా ఆ ఫుడ్  తినాలంటేనే విరాక్తి పుడుతుంది. కానీ, ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి మాత్రం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. పర్వేజ్ హష్మీ అనే వ్యక్తి ముంబైలోని గోరఖ్ పూర్ నుంచి లోకమాన్య తిలక్ టర్మినల్ మధ్య నడిచే ట్రైన్ నంబర్ 15018లో ప్రయాణం చేశాడు.

కాగా, అప్పుడు అతను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ (IRCTC) నుంచి వెజ్ థాలీ ఆర్డర్ చేశాడు. ఇక ఆర్డర్ రావడంతో.. దానిని తినాలని ఫుడ్ బాక్స్ ఓపెన్ చేయగా.. దాంట్లో బతికున్న బొద్దింక ప్రత్యక్షమైంది. పైగా అది గులాబ్ జామ్ పై అటూ ఇటూ తిరుగుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన ఆ వ్యక్తి వెంటనే బొద్దింక ఉన్న ఫుడ్ బాక్స్ ను వీడియో తీసి ఇండియాన్ రైల్వే సోషల్  మీడియా అకౌంట్ కు ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రైళ్లలో ఇలాంటి పరిశుభ్రత లేని ఫుడ్ విక్రయించడం పై విమర్శలతో మండిపడుతున్నారు. మరి, ట్రైన్ లో ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక దర్శనమిచ్చిన సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి