iDreamPost
android-app
ios-app

రతిక లాంటి అమ్మాయితో పెళ్లి.. కిరణ్ అబ్బవరం రిప్లయ్!

  • Published Oct 04, 2023 | 2:03 PM Updated Updated Oct 04, 2023 | 2:03 PM
  • Published Oct 04, 2023 | 2:03 PMUpdated Oct 04, 2023 | 2:03 PM
రతిక లాంటి అమ్మాయితో పెళ్లి.. కిరణ్ అబ్బవరం రిప్లయ్!

బిగ్ బాస్ 7తో  ఫేమస్ అవ్వడం కన్నా.. విపరీతమైన నెగిటివిటీని మూటకట్టుకున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ రతిక. ఆమెను ఎంతలా అసహ్యించుకుంటున్నారంటే.. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే పండుగ చేసుకున్నారు ఫ్యాన్స్. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత. అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంక అలియాస్ రతిక రోజ్.. టాప్ 5 కంటెస్టెంట్ అవుతుందని అనుకున్నారంతా. అదే వ్యూహంతో ఆమె కూడా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే తన టాకిల్స్ తనకే బెడిసి కొట్టాయి. పాత బాయ్ ఫ్రెండ్ గుర్తుకువస్తున్నాడని ఓ సారి, పల్లవి ప్రశాంత్ తో ప్రేమయాణం, ఆ తర్వాత గొడవలు, అటు యావర్‌తో లవ్ ట్రాక్ నడిపింది. రియల్ లైఫ్ బేబిగా మారిపోవడంతో ఛీ కొట్టారు బిగ్ బాస్ అభిమానులు. దీంతో ఆమె నాల్గవ వారంలోనే ఎలిమినేట్ అయి పోయిన సంగతి విదితమే. ఆమె ఎలిమినేషన్‌ను సంబరంలా చేసుకున్నారు వీక్షకులు.

హౌస్‌లో ఉండగానే విపరీతమైన ట్రోల్స్‪కు గురైంది. తానేమీ తప్పు చేయలేదని, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఆమె గురించి ఇప్పుడు నటుడు కిరణ్ అబ్బవరం కూడా ప్రశ్న ఎదురు కాగా, సరదాగా స్పందించి.. మరోసారి ఆమెను చర్చించుకునేలా చేశారు. టాలీవుడ్‌లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుల్లో ఒకరు కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు తాజాగా రూల్స్ రంజన్‌తో రాబోతున్నారు. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. దీంతో సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు కిరణ్. ఈసారి వినూత్నంగా ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. నేహా శెట్టితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందని ప్రశ్నించగా.. చాలా బాగుందని సమాధానం ఇచ్చారు.

కొంత మంది ఫన్నీ ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా చాలా స్పాంటినియస్‌గా ఆన్సర్ ఇచ్చాడు కిరణ్. నెగిటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తావ్ అన్న ప్రశ్నకు.. అదొక ఫేజ్ అంటే.. ఇలా నవ్వుకుంటే సమాధానం చెప్పడమే అన్నారు. మీ హుడి బాగుందీ.. ఇస్తే మూవీకి వెళ్లి మీకు బ్రేక్ ఇస్తాం.. ఇవ్వకపోయినా వెళ్తా అన్నా.. అది వేరో విషయం అంటూ మరో యూజర్ అనగా.. అడ్రస్ పెట్టు బ్రో పంపిస్తాను అంటూ పేర్కొన్నారు. మరో నెటిజన్ హీరోలా ఉన్నా వన్నా అని కామెంట్ చేయగా.. హీరోలా లేకపోయినా పర్లేదు. మీలో ఒకడిలా ఉంటే చాలు అంటూ కౌంటరిచ్చారు కిరణ్. రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి వైఫ్ తో పెళ్లి అవ్వాలి అని కోరుకుంటున్నా అని ఓ నెటిజన్ అనగా.. ‘బాబూ.. గుడుంబా(యూజర్ ను ఉద్దేశించి) నామీద ఎందుకంత పగ. పెళ్లైతే చేసుకుందాం కానీ.. రానీ ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం’ అని సమాధానమిచ్చారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş