Idream media
Idream media
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ అనంతరం పరిణామాల పై ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో చర్చిస్తున్నారు. ఈనెల 17వ తేదీన మూడో విడత లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి వరకు రెండు విడతల్లో ఈ సమావేశం కొనసాగనుంది. 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ కొనసాగించాలా లేదా సడలింపు ఇచ్చి కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలా.. అనే అంశంపై నేతల మధ్య వాడీ వేడి చర్చ సాగుతోంది.
ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు సూచనలు ఈ సమావేశంలో తీసుకుంటున్నారు. మరో ఆరు రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఆ లోపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, కరోనా వైరస్ కట్టడంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. మూడో విడత పొడిగింపు సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్న ప్రచారం జరిగినా ఆయన మీడియా ముందుకు రాలేదు.
ఇప్పటికే లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి రైళ్లను కూడా తిప్పుతోంది. సంబంధించి తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.