హ్యాట్సాఫ్: కోడలికి కిడ్నీ దానం చేసిన 70 ఏళ్ల అత్తమ్మ!

హ్యాట్సాఫ్: కోడలికి కిడ్నీ దానం చేసిన 70 ఏళ్ల అత్తమ్మ!

సాధారణంగా అత్తాకోడళ్లంటే మనకు గిల్లి కజ్జాలే  గుర్తుకు వస్తాయి. నిత్యం ఏదో ఒక విషయంపై వారిద్దరు గొడవ పడుతునే ఉంటారు.  ఒకరిపై మరొకరు పక్కవారి వద్ద  ఆరోపణలు చేసుకుంటారు. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగా లేకపోయినా.. మరొకరు లోలోపల సంతోష పడుతుంటారు. అలానే చాలా తక్కువ మంది మాత్రమే కలిసి మెలసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే అత్త గురించి తెలిస్తే.. మీరు హ్యాట్సాప్  చెప్పకుండా ఉండలేరు.  కోడలికి కిడ్నీ పాడై పోవడంతో  అత్తమ్మ అవయవదానం చేశారు.  అది కూడా 70 ఏళ్ల వయస్సులో  చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రకు చెందిన 70 ఏళ్ల ప్రభా కాంతిలాల్.. తన కుమారుడు జితేష్ మోటా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. జితేష్ మోటా భార్య 43 ఏళ్ల అమిషా మోటాకు అనారోగ్యానికి గురికావడంతో  ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. కిడ్నీ పాడైందని తెలిపారు.  దీంతో తొలుత ఆమిషా మోటా భర్త జితేష్ మోటా  కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కానీ ఆయకు డయాబెటీస్ ఉండటంతో.. అతని కిడ్నీ తీసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. అలానే అమిషా..తల్లిని సంప్రదించగా కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం.

ఇలాంటి సమయంలో అమిషా.. అత్త ప్రభా కాంతిలాల్ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన వయస్సును సైతం  లెక్క చేయకుండా కోడలికి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. ఆమెకు 70 ఏళ్లు కావడంతో కిడ్నీ దానం చేయడం.. ఆపరేషన్ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడిన వారి కుటుంబ సభ్యులు వద్దని వారించారు. అయినా వారి మాటలు పట్టించుకోని ఆమె.. కిడ్నీఇచ్చేందుకు సిద్ధమైంది. అమిషాకు కిడ్నీ మార్చేందుకు ఇంకా సమయం ఉందని.. మరేవరినైనా చూద్దామని వైద్యులు, బంధువులు చెప్పినా ప్రభా ఒప్పుకోలేదు.

అమిషా తన కోడలే కాదని బిడ్డని.. ఆమె ఆరోగ్యం కంటే తనకేది ముఖ్యం కాదని పేర్కొంది. చివరికి కుటుంబ సభ్యులు సరే అనడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభా కాంతిలాల్ మోటా కిడ్నీని..ఆమె కోడలు అమిషాకు  వైద్యులు అమర్చి విజవంతంగా ఆపరేషన్‌ చేశారు. కొన్ని రోజుల తరువాత ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి… ఇంటికి వెళ్లారు. అత్త..కోడలికి కిడ్నీ దానం చేయడం అనేది చాలా అరుదుగా జరిగే ఘటన అని చాలా మంది అంటున్నారు. కిడ్నీ దానం చేసిన ఆ అత్తపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. మరి.. ఈ బంగారు అత్తమ్మపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments