iDreamPost
android-app
ios-app

7 ఇయర్స్ ఆఫ్ బాహుబలి ప్రైడ్, సెల‌బ్రేట్ చేసిన త‌మ‌న్నా

  • Published Jul 10, 2022 | 1:32 PM Updated Updated Jul 10, 2022 | 1:32 PM
7 ఇయర్స్ ఆఫ్ బాహుబలి ప్రైడ్, సెల‌బ్రేట్ చేసిన త‌మ‌న్నా

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంచలనం సృష్టించిన చిత్రాలలో మొద‌టి స్థానంలో ఉన్న సినిమా బాహుబలి . ఇది ఇండియ‌న్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది. అదే స‌మ‌యంలో రాష్ట్రాల వారీగా, భాష‌ల వారీగా చీలిన ఇండియ‌న్ సినిమాను ఏకం చేసి, అన్ని స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసింది. ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ కాద‌ని తేల్చి చెప్పింది. ప్రభాస్, తమన్నా భాటియా, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి న‌టుల‌కు గ్రాండ్ సినిమాటిక్ విజ‌న్ ఉన్న SS రాజమౌళి క‌లిస్తే ఏమ‌వుతుందో, బాహుబ‌లి ఒక సాక్ష్యం. నేటితో బాహుబలి: ది బిగినింగ్ విడుదలై 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సినిమాలో తమన్నా ఒక వండ‌ర్.

అందాల సుందరి తమన్నా భాటియా బాహుబలి షూటింగ్‌లోని కొన్ని స్టిల్స్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. బాహుబ‌లి సినిమా త‌మ‌న్నా హృద‌యానికి బాగా దగ్గ‌రైన సినిమా. “ఏడేళ్ల తర్వాత కూడా నన్ను అవంతిక అని పిలిస్తే అది అతివాస్తవంగా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన సినిమా ఫ్రాంచైజీలో భాగమైనందుకు, గర్వపడుతున్నాను” అని తమన్నా క్యాప్ష‌న్ రాసింది. కుంటాల దేశ నివాసి, విల్లును ఎక్కుపెట్ట‌గ‌ల‌ పోరాట యోధురాలు అవంతిక పాత్రను తమన్నా పోషించింది. ఆమె ట్వీట్‌ను చూడండి

త‌మ‌న్నా షేర్ చేసిన స్టిల్స్ అన్నీ అంత‌కుముందు చూసిన‌వే. నిజానికి, ఆమె ఫ్యాన్స్ కొంద‌రు ఎక్కువ‌గా ఆశించారు.

180 కోట్ల బడ్జెట్‌తో ఎపిక్ యాక్షన్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రూ.600-650 కోట్ల బిజినెస్ చేసింది. ఇది ఇంటా బైటా గెల్చిన సినిమా. ఆ త‌ర్వాతే ప్రభాస్ బాక్సాఫీస్ ఇంటిపేరు అయ్యాడు. పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు. బాహుబలిలో ప్రభాస్ ది ద్విపాత్రాభినయం.

ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసిన సినిమాగా తమన్నా బాహుబలికి క్రెడిట్ ఇచ్చింది
ఇంతకుముందు ఇంటర్వ్యూలో, బాహుబలికి ఆ రీచ్ ఉంది, అది భారతదేశాన్ని ప్రపంచం ముందు నిలిపింది. మాకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. ఇది నిజంగా పెద్ద ప్రోత్సాహం. మీరు ఇన్ స్పైర్ అయిన మీ వ‌ర్క్ ను ఎవ‌రైనా మెచ్చుకొంటుంటే, మీరు దానిని మరింత గొప్ప‌గా చేయాల‌నుకొంటార‌ని త‌మ‌న్నా అంది.