iDreamPost
android-app
ios-app

మహమ్మరి ఆగడంలేదు.. కొత్తగా 354 కేసులు

మహమ్మరి ఆగడంలేదు.. కొత్తగా 354 కేసులు

మహమ్మరి కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 354 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 8 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వల్‌ తెలిపారు.

తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,412 కు చేరుకుంది. వీరిలో 326 మంది కోలుకున్నారు. 117 మంది చనిపోగా.. మిగతా వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కరోనాను నియంత్రించేందుకు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడమే ఏకైక మార్గమని లవ్‌ అగర్వల్‌ మరోమారు స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు మూడు దశల ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ కేసులను గుర్తించేందుకు అనుమానితులకు కరోనా పరీక్షలు నిరంతరం చేస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా వ్యాప్తి తగ్గినట్లు లవ్‌ అగర్వల్‌ చెప్పారు.

దేశంలోని ప్రముఖ నగరాల్లోని మురికివాడల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నట్లు లవ్‌ అగర్వల్‌ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఆగ్రలలో ఉన్న స్లమ్‌ ఏరియాల్లో ముందస్తు చర్యలు పటిష్టంగా చేపడుతున్నామని పేర్కొన్నారు.