రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి దూకేసిన 18 మంది ప్రయాణికులు! బ్రిడ్జ్‌ పైనుంచి పడితే..

Howrah Amritsar Express, Uttar Pradesh, Indian Railways: రైలు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. రైలులో చిన్న అలికిడికి కూడా ప్రయాణికులు బెదిరిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Howrah Amritsar Express, Uttar Pradesh, Indian Railways: రైలు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. రైలులో చిన్న అలికిడికి కూడా ప్రయాణికులు బెదిరిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

గత కొన్ని నెలలుగా మన దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వంద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు రైల్వే ప్రయాణికులు. నెలకో ఘోర రైలు ప్రమాద వార్త వింటూ.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకే చాలా మంది ట్రైన్‌ ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. కానీ, అలా భయపడుతూ కూర్చుంటే పనులు కావు కాబట్టి.. ఒకింత భయంతోనే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ట్రైన్‌లో అగ్ని ప్రమాద పుకార్లు చెలరేగి.. తొక్కిసలాట చోటు చేసుకుంది. రైలులో అగ్ని ప్రమాదం జరిగిందనే పుకార్లు చెలరేగడంతో ప్రయాణికులు భయాందళనకు గురై.. ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి దూకేశారు.

ఈ ఘటన హౌరా నుంచి అమృత్‌సర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. ఈ ట్రైన్‌లో ఎవరో జనరల్‌ కోచ్‌లోని అగ్నిమాపక యంత్రాన్ని స్విచ్‌ ఆన్‌ చేయడంతో గందరగోళం తలెత్తింది. దీంతో.. కొంతమంది ప్రయాణికులు ‍ట్రైన్లో మంటలు తలెత్తాయని కంగారు పడ్డారు. ఆ వార్త ట్రైన్‌లో దావనంలా వ్యాపించింది. దాంతో జనరల్‌ బోగిల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. అంతే.. తమ ప్రాణాలను అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి యూపీలోని ఓ బ్రిడ్జ్‌పై ట్రైన్‌ ఉండగా.. నీటిలోకి దూకేశారు. అలా దూకేసిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>18 passengers jumped from running train of howrah amritsar express <a href=”https://t.co/znB6ky6hoz”>pic.twitter.com/znB6ky6hoz</a></p>&mdash; Sayyad Nag Pasha (@nag_pasha) <a href=”https://twitter.com/nag_pasha/status/1822625085884117101?ref_src=twsrc%5Etfw”>August 11, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

Show comments