హోటల్లో బిర్యాని తిని అస్వస్థతకు గురైన 13 మంది

హైదరాబాద్‍లోని ప్రముఖ హోటల్ అల్ఫాలో కలుషిత ఆహారం తిని ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన ఘటన మర్చిపోక ముందు.. తాజాగా విశాఖ పట్నంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్ లో బిర్యాని తిని ఆసుపత్రి పాలయ్యారు యువకులు. వినాయక చవితి సంబరాలను బాగా జరుపుకున్నామన్న ఆనందంలో అందరూ కలిసి పార్టీ చేసుకుందామని భావించారు గాజువాక పరిధిలోని ములగాడకు చెందిన 13 మంది యువకులు. అంతా కలిసి గాజువాకలో ఉన్న మండీ క్రూడ్స్‌కు వెళ్లారు. బిర్యానీతో పాటు చికెన్ సంబంధించిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేశారు. ఎంచక్కా హాయిగా సరదాగా జోకులు వేసుకుంటూ..నచ్చింది కడుపారా తిన్నారు. తిరిగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

ఇక పొద్దునే మొదలైంది అసలు సమస్య. వరుసగా విరేచనాలు, వాంతుల బారిన పడ్డారు. దీంతో నిరాశానికి గురయ్యారు. ఒకరి ఇద్దరు కాదూ.. తిన్న 13 మంది యువకులు అస్వస్థతకు గురవ్వడంతో పెద్దలు సైతం భయాందోళనలకు గురయ్యారు. వీరందర్ని తీసుకుని కేజీహెచ్‌కు తరలించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మండీ క్రూడ్స్ హోటల్ తఖిలీ చేశారు. అనంతరం ఆ హోటల్ ను మూసివేశారు. దాని యజమానిపై కేసు నమోదు చేశారు. కాగా, అస్వస్థతకు గురైన వారిలో ఒకరు తప్ప మిగిలిన వారంతా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. అలా బిర్యానిని ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వీరంతా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

Show comments