కేంద్ర ప్రభుత్వ పథకం.. ఉచితంగా నెలకు 8 వేలు.. ఇలా పొందండి

PM Kaushal Vikas Yojana 2024: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను అందిస్తున్నది. ఆ పథకం ద్వారా నెలకు 8 వేలు ఉచితంగా పొందొచ్చు. దీనికి అర్హులు ఎవరంటే? ఇలా అప్లై చేసుకోండి.

PM Kaushal Vikas Yojana 2024: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను అందిస్తున్నది. ఆ పథకం ద్వారా నెలకు 8 వేలు ఉచితంగా పొందొచ్చు. దీనికి అర్హులు ఎవరంటే? ఇలా అప్లై చేసుకోండి.

దేశంలో సరైన స్కిల్స్ లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉద్యోగాలు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన నైపుణ్యాలు లేక అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి సాయమందించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు, స్వయం ఉపాధి కోసం లోన్స్ అందిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నది. విద్యార్థుల చదువుకోసం స్కాలర్ షిప్స్ కూడా అందిస్తున్నది. కేంద్రం అందించే పథకాల్లో ప్రధాన మంత్రి కౌశల్ వికాస పథకం ఒకటి. ఈ స్కీం ద్వారా ఉచితంగా రూ. 8 వేలు పొందొచ్చు. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు మీకోసం..

కేంద్రం తీసుకొచ్చిన పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా స్కిల్ డెవలప్ చేసుకుని ఉద్యోగం పొందే వీలు ఏర్పడింది. యువత ఈ పథకం ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ పథకం ద్వారా భారత్ లోని నిరుద్యోగ యువత, వివిధ రంగాల్లో శిక్షణ తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ (ట్రైనింగ్) ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ఈ పథకానికి భారతీయ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే శిక్షణ తీసుకోవచ్చు. యువత స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేయొచ్చు. ఈ కోర్స్ చేసిన సమయంలో ప్రతి యువకుడికీ నెలకు రూ.8 వేలు చొప్పున ఇస్తారు. అయితే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.

ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు చేసిన వారికి, కోర్సు పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుంది. దేశంలో ఎక్కడైనా ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ఆన్ లైన్ ట్రైనింగ్ కాబట్టి ఇంట్లో ఉండి కూడా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి ఆన్ లైన్ లో www.pmkvyofficial.org ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు:

దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. దేశంలోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారుడు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. కనీస విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు, విద్యార్హత పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కలిగి ఉండాలి.

Show comments