బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ రోడ్లపైకి యమునా నది నీళ్లు.. లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయాలంటూ..!

ఇంక వరద నీరు ఢిల్లీని ముంచెత్తుతుందని భయాందోళన చెందుతున్నారు. వరదలపై సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించడమే కాకుండా.. కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఇంక వరద నీరు ఢిల్లీని ముంచెత్తుతుందని భయాందోళన చెందుతున్నారు. వరదలపై సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించడమే కాకుండా.. కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారిపోయేలా ఉంది. వర్షాలు, వరదల దెబ్బకు ప్రజలు బిక్కు బిక్కుమంటు బతుకుతున్నారు. యమునా నది ప్రమాద స్థాయిని దాటేసింది. యమునా నది నీరు ఢిల్లీ రోడ్లపైకి వచ్చేశాయి. ఇంక వరద నీరు ఢిల్లీని ముంచెత్తుతుందని భయాందోళన చెందుతున్నారు. వరదలపై సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించడమే కాకుండా.. కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఢిల్లీ పరిస్థితులు అందరినీ కలవర పెడుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది. యమునా నదిలో నీటి ఉద్ధృతి తగ్గే వరకు.. హర్యానా నుంచి నీటి ప్రవాహాన్ని ఆపాలని, ఢిల్లీకి పైనున్న డ్యామ్ ల నుంచి నీటి విడుదలను కట్టడి చేయాలంటూ కోరింది. ఢిల్లీకి ఉన్న వరద ముప్పుపై అటు కేంద్రం కూడా సమీక్ష చేసింది. ప్రస్తుతం వరద నీరు నార్త్ ఢిల్లీలోని వీధుల్లోకి చేరినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

అధికారులు అంతా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వారి ట్విట్టర్ ఖాతాలో.. రింగ్ రోడ్డులో మొనాస్టరీ- ఐఎస్టీబీ, కశ్మీర్ గేట్ వద్ద యమునా నది వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్లు తెలిపారు. ఢిల్లీ నగరవాసులు ఆ రోడ్ల మీదకు రాకండి అంటూ సూచించారు. 47 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ రోడ్డు ఢిల్లీ ప్రాంతాలను కలపడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది.

యమునా నది ప్రవాహాన్ని పరిశీలిస్తే.. ఇప్పటికే 207.55 మీటర్లను దాటేసింది. 1978లో 207.49 మీటర్లు ఎత్తున ప్రవహించింది. ఆ స్థాయిని కూడా ఇప్పుడు దాటేసింది. ఇప్పుడు రోడ్ల మీదకు నీళ్లు రావడంతో ఢిల్లీ ప్రజలు అప్రమత్తమయ్యారు. ఏ క్షణమైనా వరద నీరు ఢిల్లీ వీధులను ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న తర్వాత ఒక్క ఢిల్లీ ప్రజలే కాదు.. దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show comments