Venkateswarlu
Venkateswarlu
సాధారణ జనానికి రక్షక భటులంటే భయం బొత్తిగా పోయింది. తప్పు తమదైనా పోలీసుల మీదకే రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో గొడవలు పెట్టుకుని తిట్టిన, దాడులకు పాల్పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా, ఓ యువతి ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంగించటమే కాకుండా.. అలా చేయకూడదని చెప్పినందుకు ట్రాఫిక్ పోలీసులనే తిట్టింది. చెయ్యి నరికేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల నుపుర్ పాటెల్ కొద్దిరోజుల క్రితం ముంబైలోని తన అన్న ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ముంబైలోని బాంద్రా-వోర్లీ సీ లింక్ బ్రిడ్జిపై విహరించాలనుకుంది. అన్నకు విషయం చెప్పి అతడి బైకుపై బ్రిడ్జి దగ్గరకు బయలు దేరింది. బైకు మీద ఆ సముద్రపు బ్రిడ్జిపై తిరుగుతూ ఉంది. అయితే, ఆ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాలు నడపటం నిషేదం. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బ్రిడ్జిపై నుంచి వెనక్కు వెళ్లిపోవాలని ఆమెకు చెప్పారు.
అయితే, వారి మాటలు ఆమె లెక్క చేయలేదు. మాటకు మాట సమాధానం చెప్పసాగింది. ‘బైకుపై చెయ్యి వేస్తే చెయ్యి నరుకుతా’ అంటూ ట్రాఫిక్ పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో వారికి కూడా కోపం వచ్చింది. లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. ఈ నేపథ్యంలో యువతి పిస్తల్‌ను పోలి ఉన్న సిగరెట్ లైటర్‌ను వారివైపూ చూపిస్తూ తిట్టింది. అతిగా ఆవేశపడి చివరకు జైలు పాలైంది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించండం, ట్రాఫిక్ పోలీసులను తిట్టడం వంటి కారణాలతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Absolutely shameful video. This does not represent women empowerment.
Just came across a shocking video A 26-year-old woman, Nupur Patel from MP was arrested on Sep 15 for joyriding on her motorcycle without a helmet on Bandra-Worli Sea Link.
Things…
— Divya Gandotra Tandon (@divya_gandotra) September 24, 2023