Venkateswarlu
Venkateswarlu
కుక్క పోస్టర్ మహిళకు ఓ వ్యక్తికి మధ్య గొడవ పెట్టింది. తప్పిపోయిన తన కుక్క పోస్టర్ చింపేశాడన్న కోపంతో ఆ మహిళ సొసైటీ ప్రెసిడెంట్‌పై రెచ్చిపోయింది. అతడ్ని దారుణంగా కొట్టింది. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని గోల్ఫ్ ఎవెన్యూ సొసైటీకి చెందిన ఓ మహిళ కుక్క కొద్దిరోజుల క్రితం తప్పిపోయింది.
దీంతో ఆమె తప్పిపోయిన తన కుక్క కోసం పోస్టర్లు వేయించింది. వాటిని అపార్ట్‌మెంట్‌లో కూడా అంటించింది. అయితే, ఆ పోస్టర్లను సొసైటీ ఓనర్ తొలగించాడు. ఈ నేపథ్యంలో మహిళకు కోపం వచ్చింది. సొసైటీ ప్రెసిడెంట్‌ను ఎందుకలా చేశావ్ అని నిలదీసింది. అతడు సిరిగా సమాధానం చెప్పలేదన్న కోపంతో ఆగ్రహానికి గురైంది. అతడి కాలర్ పట్టుకుని ‘నువ్వు సొసైటీ ప్రెసిడెంట్‌వి అయితే.. సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా?’ అని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా అతడి జుట్టు పట్టుకుంది.
ఆమెతో పాటు ఆమెకు తోడుగా ఓ వ్యక్తి కూడా సొసైటీ ప్రెసిడెంట్‌పై దాడికి యత్నించారు. ఆయన ఎంత బతిమాలుతున్నా వినకుండా తప్పుగా ప్రవర్తించారు. ఈ దాడిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kalesh b/w a Guy and dog-lover Woman over the guy removed the poster about a Dog in Noida pic.twitter.com/zlV5HkfZQJ
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 23, 2023