iDreamPost
android-app
ios-app

భార్యకు లవర్ తో పెళ్లి చేసిన భర్త! అసలు విషయం ఏంటంటే?

భార్యకు లవర్ తో పెళ్లి చేసిన భర్త! అసలు విషయం ఏంటంటే?

తన భార్యకు భర్తే దగ్గరుండి ఆమె ప్రియుడితో పెళ్లి చేయించాడు. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. తాజాగా బీహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త చేసిన పనికి స్థానికులు అంతా నోళ్లు తెరిచారు. భర్త తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేయడం ఏంటి? ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఆర్టికల్ ను చదవాల్సిందే.

అది బిహార్ నవాడా జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. ఇకపోతే, భార్య భర్తతో సంసారం చేస్తూనే మరో మగాడితో ఎఫైర్ పెట్టుకుంది. ఆ మహిళ భర్తకు తెలియకుండా ఈ వ్యవహారాన్ని గత కొన్ని రోజులుగా నడిపిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఆ మహిళ ఇటీవల తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ బెడ్ రూంలో ఏకాంతంగా కలిసున్నారు.

ఇదే సమయంలో ఆ మహిళ అత్తింటి వాళ్లు ఇంట్లో వచ్చి చూడగా.. ఆ వివాహిత తన ప్రియుడితో కనిపించింది. ఇది చూసి వాళ్లంతా షాక్ గురయ్యారు. కోపంతో ఊగిపోయిన భర్త కుటుంబ సభ్యులు.. ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఆమె భర్తకు తెలియజేశారు. హుటాహుటిన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త.. వారిద్దరిపై కోప్పడకుండా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తన భార్యను ఆమె ప్రియుడితో పాటు స్థానికంగా ఉన్న ఓ గుడికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు. అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులు షాక్ గురయ్యారు. ఈ ఘటనపై ఒక్కోరు ఒకలా స్పందిస్తున్నారు.