nagidream
Why Microsoft's CrowdStrike Issue Didn't Effect On Indian Railways: మైక్రోసాఫ్ట్ విండోస్ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు, హాస్పిటల్ సేవలు సహా అనేక సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కానీ ఇండియన్ రైల్వేస్ లో మాత్రం ఈ ప్రభావం కనిపించలేదు. దీనికి కారణం ఏంటంటే?
Why Microsoft's CrowdStrike Issue Didn't Effect On Indian Railways: మైక్రోసాఫ్ట్ విండోస్ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు, హాస్పిటల్ సేవలు సహా అనేక సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కానీ ఇండియన్ రైల్వేస్ లో మాత్రం ఈ ప్రభావం కనిపించలేదు. దీనికి కారణం ఏంటంటే?
nagidream
ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. అంతర్జాతీయంగా విమాన సేవలు, బ్యాంకింగ్, షేర్ మార్కెట్ సేవలు సహా అనేక సేవలు నిలిచిపోయాయి. అమెరికా సహా అనేక దేశాల్లో ఈ సమస్యలు తలెత్తాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ కి సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ అనే సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్ వేర్ అప్డేట్ లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఈ కారణంగా క్రౌడ్ స్ట్రైక్ భారీ నష్టాన్నే చవి చూడాల్సి వచ్చింది. అనేక కంపెనీలు, విమానాశ్రయాల్లో తలెత్తిన అంతరాయం వల్ల క్రౌడ్ స్ట్రైక్ షేర్లు భారీగా పడిపోయాయి.
దాదాపు 16 బిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం రూ. 1.34 లక్షల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పని చేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కానీ భారతీయ రైల్వేస్ మాత్రం ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. బ్యాంకింగ్, మీడియా, విమానయాన సేవలు, హాస్పిటల్ సేవలు అన్నీ నిలిచిపోయాయి. భారతదేశంలో కూడా విమానయాన సేవలు సహా అనేది సేవలు నిలిచిపోయాయి. కానీ ఇండియన్ రైల్వేస్ సేవల్లో మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు. దీనికి కారణం భారతీయ రైల్వేస్ లో బుకింగ్ కౌంటర్లలో టికెట్లు ఇవ్వడానికి వాడే సాఫ్ట్ వేరే అని సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు.
టికెట్లు ఇవ్వడానికి ఇంకా 1999లో డెవలప్ చేసిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంనే (సీఆర్ఐఎస్) వాడుతున్నామని అన్నారు. 1999 నుంచి సీఆర్ఐఎస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంనే వాడుతుండడం వల్ల మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ ఇండియన్ రైల్వేస్ పై పడలేదని అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి అదే సిస్టంను అప్డేట్ చేస్తూ వాడుతున్నామని.. కొత్త సాఫ్ట్ వేర్ కి అప్ గ్రేడ్ అవ్వలేదని అన్నారు. అదన్నమాట విషయం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన కంపెనీలు సమస్యను ఎదుర్కుంటే భారతీయ రైల్వేస్ మాత్రం ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు.