Who Is Next Tata: టాటా వారసుడు ఎవరు? టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళేదెవరు?

Tata: లెజెండ్. ఎన్నో కోట్ల మంది స్పూర్తి. విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరు రతన్ టాటా. రతన్ టాటా స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.

Tata: లెజెండ్. ఎన్నో కోట్ల మంది స్పూర్తి. విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరు రతన్ టాటా. రతన్ టాటా స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.

భారత పారిశ్రామిక రంగానికి లెజెండ్. ఎన్నో కోట్ల మంది యువతకి స్పూర్తి. విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరు రతన్ టాటా. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యాపార వేత్తలు ఉన్నా కానీ రతన్ టాటా స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే ప్రజలకు ఆయన అందించిన సేవలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే బుధవారం రాత్రి టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో రాత్రి 11.30 గంటలకు ఆయన తన తుది శ్వాస విడిచారు. ఇంతటి గొప్ప వ్యాపారవేత్త మరణ వార్త విని దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ షాక్ అయ్యారు. టాటాకు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. ఇక రతన్ టాటా నికర ఆస్తి విలువ ఎంత? ఆయన తరువాత వారసులు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రతన్ టాటా నికర ఆస్తి విలువ విషయానికి వస్తే .. రూ.3,800 కోట్లుగా ఉంది. 2022 ప్రపంచ సంపన్నుల జాబితాలో 421వ స్థానంలో టాటా నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. సంపదకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడూ కూడా విలువలను పాటిస్తూ ఉండేవారు. భారతీయుల జీవితాలను మెరుగుపరచాలని ఆలోచించారు. ఆ దిశగానే ముందుకు సాగారు. తన జీవితంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. తన జీవితాన్ని అంతా సామాజిక విలువలకే అంకితం చేశారు. వాటికి కట్టుబడి జీవితాంతం అలుపెరగకుండా పనిచేశారు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ టాటా పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన టాటా గ్రూపుకు నాయకత్వం వహించిన తీరు అమోఘం. ఆ తీరే ఆయనను దేశ పారిశ్రామికవేత్తలలో ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిపింది. దాతృత్వానికి మరో రూపం రతన్ టాటా. తన జీవితం మొత్తం దానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దేశంలో సంభవించిన ఎన్నో విపత్తుల సమయాల్లో భారీ విరాళాలను అందించారు. రతన్ టాటా సారధ్యంలో టాటా గ్రూప్ ఎన్నో ఫేమస్ బ్రాండ్లను పరిచయం చేసింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఎయిర్ ఇండియా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా టీ, టాటా ప్లే, టైటాన్, స్టార్‌బక్స్, వోల్టాస్‌తో పాటు ఇంకా ఎన్నో బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. ఈ బ్రాండ్లు టాటా గ్రూప్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిలిపాయి.

ఇక టాటా చరిత్రలో ఒక శకం ముగిసింది. రతన్ టాటా మరణం భారత దేశ వ్యాపార ప్రపంచానికి తీరని లోటనే చెప్పాలి. అయితే రతన్ టాటా మరణం తర్వాత ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే సందేహం అందరిలో కలుగుతుంది. వేలకోట్లకు అధిపతి అయిన రతన్ టాటాకు పెళ్లి జరగలేదు. అందువలన ఆయనకు వారసులు ఎవరూ లేరు. దీంతో ఆయన వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తి ఎవరికి చెందుతుంది అనే దానిపైన సందేహం నెలకొని ఉంది. అయితే అటు టాటా గ్రూప్, టాటా సన్స్ విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే వాటికి చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు టాటా వారసుల తరువాతి తరంపై అందరి దృష్టి ఉంది.

రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా. ఆయన టాటా గ్రూప్‌ లో ముఖ్యమైన వ్యక్తి. నోయెల్.. నావల్ టాటా, సిమోన్ టాటాల కుమారుడు. ఈయన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, JN టాటా ఎండోమెంట్, బాయి హీరాబాయి JN టాటా నవ్‌సారి ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. అంతేగాక టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ , టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అలాగే నోయెల్ టాటా.. నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్ , స్మిత్ పిఎల్‌సి బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు. ఇక నోయెల్ టాటా పెద్ద కుమార్తె లియా టాటా. ఆమె స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని చేశారు. ఆమె 2006 నుండి తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా చేరినప్పటి నుండి గ్రూప్ లో భాగం అయ్యారు. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్‌లో కూడా పనిచేస్తున్నారు.

ఇక నోయెల్ టాటా చిన్న కూతురు మాయా టాటా. ఆమె టాటా గ్రూప్ లో టాటా క్యాపిటల్‌లో విశ్లేషకురాలిగా పని చేశారు. మాయ UKలోని బేయెస్ బిజినెస్ స్కూల్, వార్విక్ యూనివర్శిటీలో చదువుకున్నారు. చాలా టాటా కంపెనీల్లో కూడా వివిధ రకాల వృత్తుల్లో పనిచేశారు. ఇప్పుడు ఆమె కూడా టాటా గ్రూప్ వారసురాలిగా ఉన్నారు. ఇక మరో మరో వారసుడు పేరు నెవిల్ టాటా. ఈయన నోయెల్ టాటా కుమారుడు. ఈయన టాటా గ్రూప్ , రిటైల్ చైన్ ట్రెంట్‌ లో పని చేశారు. ఈ సంవత్సరం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, టాటా సన్స్, టాటా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ బోర్డులో కూడా జాయిన్ అయ్యారు. ఇక వీరే రతన్ టాటా వారసులు అని తెలుస్తుంది. మరి రతన్ టాటా ఆస్తుల గురించి, ఆయన వారాసుల గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments