100 మందికి పైగా చనిపోవడానికి కారణమైన భోలే బాబా ఎవరు?

Bhole Baba: టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్నాం.. కానీ మూఢ విశ్వాసాలను మాత్రం జయించలేకపోతున్నాం. దీన్ని బలహీనతగా చేసుకొని దొంగబాబాలు నిత్యం పుట్టుకొస్తునే ఉన్నారు.

Bhole Baba: టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్నాం.. కానీ మూఢ విశ్వాసాలను మాత్రం జయించలేకపోతున్నాం. దీన్ని బలహీనతగా చేసుకొని దొంగబాబాలు నిత్యం పుట్టుకొస్తునే ఉన్నారు.

ప్రపంచ దేశాలతో భారత దేశం పోటీ పడి ముందుకు సాగుతుంది. సాంకేతిక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించింది. నింగిలోకి చంద్రయాన్ 3 పంపించి ప్రపంచ దేశాలన్నీ మనవైపు తిప్పుకునేలా చేశాం. ఇన్ని విజయాలు సాధించిన ఈ దేశంలో ఇప్పటికీ మూఢ విశ్వాసం రాజ్యమేలుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని సామెత అక్షరాలా నిజం చేస్తున్నారు. మనుషుల బలహీనతను కొంతమంది దొంగబాబాలు క్యాష్ చేసుకుంటున్నారు. తాము దైవ దూతలం అంటూ.. తమను పూజిస్తే మేలు జరుగుతుందని ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు. ఓ బాబా చేసిన ఘనకార్యం వల్ల వందకు పైగా ప్రాణాలు పోవడం దేశంలో తీవ్ర సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. దైవ భక్తితో ప్రవచనాలకు అని వెళ్తే.. తొక్కిసలాట జరిగి 120 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. కేవలం 5 వేల మంది పట్టే స్థలంలో 20 వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో భోలే బాబా అనే ఆధ్యాత్మిక గురువు మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తీవ్ర విషాదం జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది.

ఇక బోలే బాబా విషయానికి వస్తే.. లీగఢ్ డివిజన్ కాస్ గంజ్ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన వాడు. 18 సంవత్సరాల పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని పోలీస్ శాఖలో విధులు నిర్వహించాడు. పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ విభాగాన్ని విడిచిపెట్టిన తర్వాత భోలే బాబా అవతారం ఎత్తాడు. తెల్లని దుస్తులు ధరించి ప్రవచనాలు చెప్పడం, సత్సంగం నిర్వహించడం లాంటివి మొదలు పెట్టాడు. అలా భోలే బాబా ‘నారాయణ్ సకార్ హరి’, ‘ సకర్ విశ్వ హరి బాబా’ గా ప్రాచుర్యం పొందాడు.ఆ విధంగా పాపులర్ అయిన బాబా కి అనుచరగణం బాగా పెరిగిపోయారు. బహిరంగ సభల్లో వేలమంది భక్తులు రావడం మొదలు పెట్టారు. భోలే బాబా ఎక్కడికి వెళ్లినా తన సతీమణిని వెంట పెట్టుకొని వెళ్తు సత్సంగ్ లను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బాబాబు అంటే రుద్రాక్షలు వేసుకొని, బూడిద పూసుకొని, విచిత్ర వేషధారణతో కాకుండా మామూలు వ్యక్తిలా కనిపిస్తుంటారు. ఆయన అనుచరులు బ్రజ్ ప్రాంతంలోని ఆగ్రా, అలీఘర్ డివిజన్లకు చెందిన దిగువ ఆర్థిక వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం.

తనకు గురువు ఎవరూ లేరని.. స్వయంగా తానే భగవంతుడిని అని చెప్పుకునేవారు. భోలే బాబాకు ఫేస్ బుక్ లో ఏకంగా మూడు లక్షల పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంత పాపులారిటీ ఉన్నప్పటికీ మీడియాను ఎప్పటికప్పుడు దూరంగా ఉంచుతూ వచ్చారు. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకున్నారు బాబా. ఎక్కువగా మంగళవారాల్లో సత్సంగ్ లను నిర్వహిస్తుంటారు. ఆయన నిర్వహించే సత్సంగ్ కి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. ఆయన పాదధూళి తాకితే పరమ పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే మంగళవారం నిర్వహించిన సత్సంగ్ కి వేలాదిగా తరలి వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి వందమందికి పైగా మృతి చెందారు. వందల మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇంతటి విషాదానికి కారణం అయిన బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

Show comments