బంపర్ ఆఫర్: ఓటు వేసిన వారికి డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, TV.. !

Diamond rings, Fridge, TVs: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేస్తే డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, టీవీ ఫ్రీగా ఇస్తున్నారు. ఓటు వేసే రోజున ప్రతీ 2 గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటిస్తూ ఉంటారు. గెలిచిన వారికి బహుమతులు అందిస్తారు. ఎక్కడంటే..

Diamond rings, Fridge, TVs: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేస్తే డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, టీవీ ఫ్రీగా ఇస్తున్నారు. ఓటు వేసే రోజున ప్రతీ 2 గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటిస్తూ ఉంటారు. గెలిచిన వారికి బహుమతులు అందిస్తారు. ఎక్కడంటే..

ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఓటు అనేది ఎంతో విలువైనది. అందుకే ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి భాధ్యత. ఇలానే ఈ ఓటే దేశాభివృద్ధిని నిర్ణయిస్తుంది. కానీ నేటికాలంలో చాలా మంది ఓటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారే ఎక్కువగా ఓటు హక్కుపట్ల నిరక్ష్యంగా ఉంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో పొలింగ్ ను పెంచేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలానే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఓటు వేసిన వారికి ఫ్రీగా టిఫిన్లు, బిర్యానీ, బీరు ఇస్తామని ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ఏకంగా ఓటువేసే వారికి డైమంగ్ రింగ్, టీవీ వంటి వాటిని ఇస్తామని ప్రకటించారు. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది ఎంతో ముఖ్యం. మనం ఓటు వేసినపుడే మాత్రమే దేశ స్థితిగతులపై మార్పు ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలా మంది మాత్రం ఓటు వేయడానికి బద్ధకిస్తూ ఉంటారు. ప్రైవేటు ఉద్యోగులకు పోలింగ్ రోజున హాలీడే ఇచ్చినా.. ఓటు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే ఓటింగ్ శాతాన్ని పెంచేదుకు ఎన్నికల సంఘం, వివిధ ఎన్జీఓలు,  ప్రముఖులు ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఆ నియోజకవర్గంలో మాత్రం అద్భుతమైన  ఆఫర్ ను ప్రకటించారు. పోలింగ్ బూత్‌లో లక్కీ డ్రా నిర్వహించాలని  అధికారులు నిర్ణయించారు.  ఆ లక్కీ డ్రాలో గెలిచిన వారికి డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, టీవీ సహా వివిధ రకాల బహుమతులు ఇవ్వనున్నారు.  పోలింగ్ ప్రతీ రెండు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీసి విన్నర్‍‌ పేరును ప్రకటించనున్నారు. మధ్యప్రదే‌శ్‌లోని భోపాల్ నియోజకవర్గ ప్రజలకు ఈ బంపర్ ఆఫర్ లో పాల్గొనే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 లోక్ సభ స్థానాలు  ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 13 స్థానాలకు పోలింగ్ జరిగింది.  మిగిలిన స్థానాలకు మూడు, నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆయన లోక్ సభ స్థానాల పరిధిలోని అధికారులు విస్తృత్త్ ప్రచారంచ  చేస్తున్నారు. ఈ క్రమంలోనే భోపాల్  నియోజవర్గ అధికారులు ఈ వినూత్న, బంపర్ ఆఫర్ కి తెరతీశారు. ఓటు వేసిన తర్వాత ఓటరు తన పేరు, ఫోన్ నెంబర్ రాసి ఆ వాలంటీర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత రెండు రోజులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు. అందులో గెలిచిన వారికి డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్‌లు, టెలివిజన్ వంటి బహుమతులు అందించనున్నారు. ఓటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు భోపాల్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. మరి.. ఈ నియోజవర్గ అధికారులు తీసుకున్న ఈ వినుత్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments