చనిపోయిన పాపను బతికిస్తానని.. 24 ఏళ్ల క్రితమే ‘విరూపాక్ష’ చూపించిన భోలే బాబా!

చనిపోయిన పాపను బతికిస్తానని.. 24 ఏళ్ల క్రితమే ‘విరూపాక్ష’ చూపించిన భోలే బాబా!

Bhole Baba: మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈనేపథ్యంలో ఈ విషాదానికి కారకులైన భోలో బాబా గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ విడుదలైన విరుపాక్ష సినిమా తరహ సీన్ ను 24ఏళ్ల క్రితమే భోలే బాబా చూపించారు.

Bhole Baba: మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈనేపథ్యంలో ఈ విషాదానికి కారకులైన భోలో బాబా గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ విడుదలైన విరుపాక్ష సినిమా తరహ సీన్ ను 24ఏళ్ల క్రితమే భోలే బాబా చూపించారు.

ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన సంఘటన జరిగిన సంగతి తెలిసింది. యూపీలోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.  భోలే బాబా అనే వ్యక్తి నిర్వహించిన సత్సంగ్  ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ  తొక్కిసలాట ఘటనలో 123 మందికి పైగా మృతి చెందారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే పోలీస్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా మారిన నారాయణ్ సకార్ విశ్వహరి అలియాస్ భోలో బాబా గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ విడుదలైన విరుపాక్ష సినిమా తరహ సీన్లను 24ఏళ్ల క్రితమే భోలే బాబా చూపించారు. తాజాగా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మంగళవారం ఉత్తర ప్రదేశ్ లో ఘోరమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసింది.  పోలీస్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా మారిన భోలే బాబా మంగళవారం నిర్వహించిన సత్సంగ్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. గతంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లొచ్చి..బాబాగా అవతారం ఎత్తారు. ఇదే సమయంలో ఆయన మాటలకు స్థానిక జనాలు బాగా ఆకర్షించబగడ్డారు. భోలే బాబాకు అతీంద్రయ శక్తులు ఉన్నాయని ఆయన భక్తలు నమ్ముతారు. మనకు కలిగే బాధలను తొలగిస్తాడని, భూత ప్రేతాత్మలను వదిలించే మాంత్రిక శక్తులు కలిగి ఉన్నాడని గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే విరూపాక్షలోని ఓ సీన్ ను 24 ఏళ్ల క్రితమే భోలే బాబా చూపించారు.

24 ఏళ్ల క్రితం ఆగ్రాల్లో 16 ఏళ్ల ఓ బాలిక చనిపోతే.. ఆమె విషయంలో ఆయన పెద్ద సీన్ చూపించారు. తనకు దివ్యశక్తి ఉందని  చనిపోయిన బాలికను తిరిగి బతికిస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బలవంతంగా మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఇక ఈ ఘటనపై ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. తర్వాత ఈ కేసును పోలీసులు మూసివేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో అధర్వణ వేదాభ్యాసుకుడైన హీరోయిన్ తండ్రి.. తాను పొందిన శక్తుల ద్వారా పక్షవాతంతో బాధపడుతోన్న తన భార్య ఆత్మను చనిపోయిన బాలికలోకి పంపి.. బతికించేందుకు ప్రయత్నం చేస్తాడు. అచ్చం భోలే బాబా కూడా  24 ఏళ్ల క్రితం అలాగే చేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఈ  భోలే బాబా కారణంగా 123 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ కేసులో చాలా మందిని అరెెస్టు చేసిన పోలీసులు ఈ భోలే బాబా కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన  జరిగిన సమయంలో తొలుత ఈ బాబా పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే  ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదని వాదనలు వినిపించాయి. ఇక పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో చివరకు భోలో బాబా పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.  ఇదే సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ పరారీలో ఉండగా.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది.

Show comments