iDreamPost
android-app
ios-app

అందమైన జంట.. ఆ ఒక్క కారణంతో ఎంతపని చేశారంటే?

  • Published Apr 13, 2024 | 9:39 PM Updated Updated Apr 13, 2024 | 9:39 PM

Haryana Crime News: వారిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడ్డారు.. సహజీవనం చేస్తున్నారు. యూట్యూబర్స్ మంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వారి జీవితాల్లో దారుణ ఘటన జరిగింది.

Haryana Crime News: వారిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడ్డారు.. సహజీవనం చేస్తున్నారు. యూట్యూబర్స్ మంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వారి జీవితాల్లో దారుణ ఘటన జరిగింది.

అందమైన జంట.. ఆ ఒక్క కారణంతో ఎంతపని చేశారంటే?

ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం, చికాకు, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పో పలు దారుణాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఎదుటివారిపై దాడులు చేయడం, హత్యలకు తెగబడతున్నారు. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. చిన్నకారణంతోనే ఓ యూట్యూబర్ జంట దారుణమైన నిర్ణయం తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని బహదూర్ గఢ్ లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. 7వ అంతస్తు నుంచి దూకి యూట్యూబర్ జంట బలవన్మరణానికి పాల్పపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గర్విట్ (25), నందిని (22) కలిసి కొంత కాలంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కోసం షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన వాగ్వాదం ఇద్దరూ మనస్థాపనికి గురై ఆత్మహత్యకు పాల్పపడి ఉండవొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గర్విట్, నందిని లివింగ్ రిలేషన్ లో ఉన్నారని పోలీసులు తెలిపారు.

కొంత కాలంగా సహజీవనం చేస్తున్న గర్విట్, నందిని టీమ్ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో బహదూర్ గఢ్ లో ఏడవ అంతస్తు ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరితో పాటు ఐదుగురు టీమ్ సభ్యులు కూడా ఉంటున్నారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గర్విట్, నందిని ఇద్దరూ కలిసి ఏడో అంతస్తు నుంచి కిందకు దూకారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయి అక్కడిక్కడే కన్నుమూశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గర్విట్, నందిని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.