Surgery: సర్జరీ కోసం హాస్పిటల్ కు వెళ్తే.. డాక్టర్లు చేసిన పనికి..

కిడ్నీలో స్టోన్ ఏర్పడిందని శాస్త్రచికిత్స కోసం ఓ యువతి ఆసుపత్రికి వెళ్లింది. అయితే చికిత్స కోసం వచ్చిన ఆసుపత్రికి వెళ్తే.. డాక్టర్లు చేసిన ఆ ఒక్క పనికి ఊహించని దారుణం చోటు చేసుకుంది.

కిడ్నీలో స్టోన్ ఏర్పడిందని శాస్త్రచికిత్స కోసం ఓ యువతి ఆసుపత్రికి వెళ్లింది. అయితే చికిత్స కోసం వచ్చిన ఆసుపత్రికి వెళ్తే.. డాక్టర్లు చేసిన ఆ ఒక్క పనికి ఊహించని దారుణం చోటు చేసుకుంది.

సాధారణంగా ఎవరైనా ఆరోగ్యం బాగాలేక పోయినా, ఒంటికి కష్టంగా ఉన్న వెంటనే వైద్యులకు సంప్రాదిస్తారు. ఇక ఆ సమస్యకు తగిన చికిత్స చేయించుకోని ఉపశమనం పొందుతారు. కానీ, డాక్టర్లే సమస్యగా మారి అమాయకపు ప్రజల ఆయువు తీసేస్తుంటే.. ఊహించుకోవడానికే భయంగా ఉన్న ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలామంది వైద్యులు ఈ మధ్య కాలంలో శాస్త్ర చికిత్స పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు.

ముఖ్యంగా  డబ్బు కోసం ఆత్యాశకి పోయి తెలిసిన తెలియని వైద్యంతో హెవీ డోస్ మెడిసెన్స్ ను రోగులకు ఇవ్వడం, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించడం వంటివి చేస్తున్నారు. దీంతో వైద్యుడిని దేవుడిగా భావించే రోగులు.. వారి చేతిలోనే శాశ్వతంగా కన్నుముస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి అనారోగ్య సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లింది. అయితే చికిత్స మంచిగానే జరిగిందనుకుంటే.. డాక్టర్లు చేసిన పనికి ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కిడ్నీలో స్టోన్ ఏర్పడిందని శాస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి చివరికి విగతజీవిగా మారింది. కేవలం డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్లే మా కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు గుండె పగిలెలా రోధిస్తున్నారు. అయితే ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. కోలార్‌లోని నంబిగనహళ్లి గ్రామానికి చెందిన దీప్తి (22) ఏళ్ల యువతి గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే.. సమస్య మరింత పెద్దదవ్వడంతో.. స్థానిక ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ కిడ్నీ స్టోన్ సర్జరీ కోసం చేరింది.

ఇక ఆసుపత్రిలో సర్జరీ కోసం చేరిన ఆ యువతికి వైద్యులు గురువారం లాప్రోస్కోపీ సర్జరీ చేశారు. అయితే సర్జరీ అయిన కొంతసేపటికే ఆ యువతి గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు తల్లిదండ్రులకు ప్రకటించారు. దీంతో ఆ యువత తల్లిదండ్రులు సర్జరీ అయిన కొంత సేపటికే తమ కుమార్తే మరణించడం పై షాక్ కు గురైయ్యారు. అంతేకాకుండా.. కుమార్తే మరణంపై తల్లిదండ్రులకు పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఆస్పత్రి వైద్యులపై యువతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తుమందు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే తమ కుమార్తే మరణించిందని యువతి తల్లిదండ్రులు ఆరోపణలు వ్యక్తం చేశారు.

దీంతో ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి యువతి మరణంపై ఆరా తీశారు. అయితే తల్లిదండ్రులు తమ కుమార్తే మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసలు ఆరోపణలు చేయడంతో.. వారు కేసు నమోదు చేసుకున్నారు.  కాగా, యువతి మరణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నమని పోలీసులు తెలిపారు. మరి, శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే వైద్యులు నిర్లక్ష్యంకు యువతి బలైన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments