Keerthi
స్నేహితుడి బర్త్ డే వేడుకలకు త్వరగా వెళ్లలని ఓ వ్యక్తి.. తొందరపాటులో చేసిన తప్పు ఓ ఇద్దరి ప్రాణాలను అర్థంతరంగా ముగిసిపోయాయి. ఓ రెండు రెండు కుటుంబాలు తీవ్ర శోకసంధ్రలో మునిగిపోయాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
స్నేహితుడి బర్త్ డే వేడుకలకు త్వరగా వెళ్లలని ఓ వ్యక్తి.. తొందరపాటులో చేసిన తప్పు ఓ ఇద్దరి ప్రాణాలను అర్థంతరంగా ముగిసిపోయాయి. ఓ రెండు రెండు కుటుంబాలు తీవ్ర శోకసంధ్రలో మునిగిపోయాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కంటే, మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించిన సరే.. అవతలి వ్యక్తులు చేసే తప్పిదాలు, నిర్లక్ష్యం వలన ప్రమాదం ఏ వైపు నుంచైనా పొంచుకొస్తుంది. దీని వల్ల అర్ధాంతరంగా ఓ నిండు జీవితం ముగిసిపోతుంది. కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. చాలామంది పిల్లలు అనాథాలుగా మారుతారు. ఇలా ఒకరు తొందరపాటు చేసిన ఒక్క తప్పు.. కొన్ని కుటుంబాల్లో తీర్చలేని నష్టాన్ని, బాధని మిగిలస్తుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ వ్యక్తి చేసే నిర్లక్ష్య పనికి ఓ రెండు జీవితాలు బైలపోయాయి. ఓ రెండు కుటుంబాలు తీవ్ర శోకసంధ్రలో మునిగిపోయాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువతులను రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఆ యువతలు అమాంతంగా గాల్లోకి ఎగిరిపడి రోడ్డు పై పడటంతో.. తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ ఆ ఇద్దరు యువతులు మరణించారు. అయితే ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇందౌర్ లోని ఖజరానా ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్న లక్ష్మీ తోమర్ (24), దీక్షా జాదౌన్ (25) అనే యువతులు అనంతంర ఇల్లకు తిరిగి వెళ్తుతుండగా.. ఎదురుగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు వారి స్కూటీని బలంగా ఢీ కొట్టిది. దీంతో ఆ యువతులు ఇద్దరూ వాహనంతో సహా.. కొన్ని అడుగులు ఎత్తుకు ఎగిరిపడ్డారు.
దీంతో ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వెంటనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. నిందుతుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే.. నిందితుడు గజేంద్ర సింగ్ గా పోలీసులు గుర్తించి అదుపులో తీసుకున్నారు. ఇకపోతే నిందితుడు స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు కేకు ఇచ్చేందుకు వెళ్లలనే అతృతతో.. రాంగ్ రూట్ లో వచ్చినట్లు పోలీసుల విచారణ తెలిసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయొ. అయితే ఏదీ ఏమైనా క్షణిక తొందరపాటుతో చేసిన ఈ తప్పుకు ఓ రెండు జీవితాలు బలైపోయాయని చెప్పవచ్చు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న యువతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని.. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు ఇలా విగతాజీవిగా పడివున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు.
#इंदौर : तेज रफ्तार बीएमडब्ल्यू कार ने स्कूटी सवार दो युवतियों को मारी जोरदार टक्कर
एक्सीडेंट का सीसीटीवी भी आया सामने
अस्पताल में इलाज के दौरान दोनों युवतीयों की हुई मौत
ड्राइवर गाड़ी को छोड़कर हुआ फरार, खजराना थाना पुलिस आरोपी की तलाश में जुटी #Indore #MadhyaPradesh pic.twitter.com/lhFaHzFV5n— DINESH SHARMA (@medineshsharma) September 15, 2024