iDreamPost
android-app
ios-app

దేశానికి పెళ్లి కళ! 38 లక్షల వివాహాలు! ఖర్చు ఎంతో తెలుసా?

దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీని కోసం వివాహాలు చేసే కుటుంబాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు వ్యాపారుల జాతీయ సమాఖ్య వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీని కోసం వివాహాలు చేసే కుటుంబాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు వ్యాపారుల జాతీయ సమాఖ్య వెల్లడించింది.

దేశానికి పెళ్లి కళ! 38 లక్షల వివాహాలు! ఖర్చు ఎంతో తెలుసా?

పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. దీని కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తుంటారు. ఇక వారి ఆర్థిక స్థోమతను అంచనా వేసుకుని పెళ్లి వేడుకకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి దేశంలో పెళ్లిళ్ల కళ వచ్చింది. రానున్న రోజుల్లో వివాహాలు చేసుకునే వారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తాజా లెక్కల ప్రకారం… దేశంలో త్వరలో లక్షల్లో వివాహాలు జరగనున్నాయని వ్యాపారుల జాతీయ సమాఖ్య ఇటీవల ఈ లెక్కలను వెల్లడించింది. దీంతో పాటు వివాహాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు కూడా తెలిపింది. అసలు దేశంలో రానున్న రోజుల్లో ఎన్ని లక్షల వివాహాలు జరగనున్నాయి? వాటి కోసం ఎంత వరకు ఖర్చు చేస్తున్నారు? ఇప్పటి వరుకు జరిగిన వివాహాల కోసం ఎంతకు వరకు ఖర్చు చేశారనే పూర్తి వివరాలు మీ కోసం.

దేశం వ్యాప్తంగా రానున్న రోజుల్లో వివిధ నగరాల్లో దాదాపు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని వ్యాపారుల జాతీయ సమాఖ్య ఇటీవల వెల్లడించింది. వీటి కోసం సుమారు రూ. 4.74 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు ఈ సమాఖ్య లెక్కల్లో తేలింది. కోటి రూపాయాలపైగా ఖర్చుతో అయ్యే పెళ్లిళ్లు 50 వేల వరకు ఉన్నాయని తెలిపింది. ఇంతే కాకుండా మరో 50 పెళ్లిళ్లకు ఒక్కో దానికి దాదాపుగా రూ.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే, దేశంలో రూ.3 లక్షలతో ఖర్చు చేసే పెళ్లిళ్లు 7 లక్షలు లోపు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ కూతురి కోసం పెళ్లికి రూ.50 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది. కోల్ కత్తాలోని ఓ బెంగాలి కుటుంబం కూడా తమ ఒక్కగానొక్క కూతురి వివాహం కోసం ఏకంగా రూ.20 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారట. దీంతో పాటు అమ్మాయి పెళ్లి కోసం కేవలం రూ.1 లక్షలు లోపు ఖర్చు చేస్తున్న కుటుంబాలు కూడా లేకపోలేదని వ్యాపారుల జాతీయ సమాఖ్య తెలిపింది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో రానున్న రోజుల్లో సుమారు నాలుగు లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, వీటి కోసం రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యాపారుల జాతీయ సమాఖ్య తాజా లెక్కలు చెబుతున్నాయి.

అయితే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్ కత్త వంటి 30 నగరాల్లోని వ్యాపారుల నుంచి ఈ సమాఖ్య పెళ్లి ఖర్చుల డేటాను సేకరించందట. గతేడాది ఇదే సమయంలో 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, వీటి కోసం సుమారు రూ. 4.4 వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది దీపావళి వేళ దేశంలోని అన్ని నగరాల్లో జరిగిన పెళ్లిళ్లతో సుమారు 3.75 లక్షల వ్యాపారం జరిగినట్లు కాన్ఫడరేషన్ ఆలిండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్ వెల్లడించారు. ఇక వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి పెళ్లిల్లో మండపాలకు సినిమా నటుల మాదరి చేసుకునేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ఢిల్లీకి చెందిన వెడ్డింగ్ ప్లానర్ సిరత్ గిల్ తెలిపారు.