ఇక బిచ్చగాళ్లు కనిపించరు.. విజయవాడతో సహా 30 నగరాల్లో..

Bhiksha-Vritti Mukt Bharat.. భిక్షాటన ఇప్పుడో వృత్తిగా మారిపోయింది. పరిస్థితులు, శరీరం సహకరించక యాచిస్తున్న వారి కన్నా.. పని చేయకుండా డబ్బులు సంపాదించవచ్చునని కొంత మంది ఇటు వైపుగా వస్తున్నారు. ఇది దేశంపై ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Bhiksha-Vritti Mukt Bharat.. భిక్షాటన ఇప్పుడో వృత్తిగా మారిపోయింది. పరిస్థితులు, శరీరం సహకరించక యాచిస్తున్న వారి కన్నా.. పని చేయకుండా డబ్బులు సంపాదించవచ్చునని కొంత మంది ఇటు వైపుగా వస్తున్నారు. ఇది దేశంపై ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పేదరికం, పరిస్థితులు, ఇతర కారణాల వల్ల చాలా మంది బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జన సంచారం ఉండే రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, సిగ్నల్స్ పడే ప్రాంతాల్లో ఎక్కువగా వీరు యాచిస్తూ ఉంటారు. బస్సుల్లో, రైళ్లలో కూడా భిక్షాటన చేస్తుంటారు. వృద్ధులు, చిన్న పిల్లలు, పసిపిల్లలు, వికలాంగులు అడగ్గానే.. పాపం అని దయ తలచి కొంత మంది డబ్బులు అందిస్తుంటారు. ప్రజలు ఇచ్చిన ఆ డబ్బులతోనే బ్రతుకు ఈడుస్తున్నారు. ఇది రాను రాను ఓ వృత్తిలా మారిపోయింది. కొంత మంది బిచ్చగాళ్లు ఇదే వృత్తిలో కోట్లు గడించారు. కానీ బిచ్చగాళ్ల కారణంగా దేశ జీవన ప్రమాణాలు ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్లు లేని భారత్ తీసుకురావాలని యోచిస్తోంది కేంద్రం.

2026 నాటికి బిచ్చగాళ్ల రహిత జోన్‌లను రూపొందించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.  భిక్షా-వృత్తి ముక్తి భారత్ (భిక్షాటన రహిత దేశం) తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ. పెద్దలు, మహిళలు, పిల్లలకు ఈ వృత్తి నుండి విముక్తి కల్పించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సమగ్ర సర్వే, పునరావాసాల కోసం ఏర్పాటు చేసేందుకు 30 నగరాలను ఎంపిక చేసింది. ‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ ప్రైజెస్ (స్మైల్) సబ్ స్కీం కిందకు వస్తుంది. యాచకుల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఉత్తరాన అయోధ్య.. తూర్పున గౌహతి, పశ్చిమాన త్రయంబకేశ్వరం, దక్షిణాన తిరువనంతపురం వరకు 30 నగరాలను గుర్తించింది.

ఇప్పటికే 25 నగరాలు యాక్షన్ ప్లాన్ సమర్పించగా.. మధ్యప్రదేశ్‌లోని సాంచిలో బిచ్చగాళ్లే లేరని నివేదికలు అందించింది. అలాగే దీని కోసం ఫిబ్రవరిలో జాతీయ పోర్టల్, మొబైల్ యాప్స్ రూపొందించనుంది.  కాంగ్రా, కటక్, ఉదయ్ పూర్, ఖుషీ నగర్ వంటి నగరాలు తమ సమ్మతిని తెలియజేయలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క విజయవాడ ఎంపికైంది. కోజికోడ్, విజయవాడ, మధురై, మైసూర్ లో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఈ నగరాల్లో హాట్ స్పాట్‌లను గుర్తించేందుకు జిల్లా, మున్సిపల్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. రోడ్ మ్యాప్ సర్వే, సమీకరణ, రెస్య్యూ, పునరావాసం కల్పించడం, విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కలిగించడం వంటి వాటి కోసం నిధులు విడుదల చేసింది. రెండేళ్లలో ఈ నగరాల సంఖ్య పెంచనుంది. అంటే ఈ లెక్కన దేశంలో యాచకులు కనిపించరేమో చూడాలి. మరీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments