ఇకపై ఉబర్ నుంచి బస్సులు.. ఆ నగరంలో తొలిసారి అందుబాటులోకి సేవలు

ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థలో ఉబర్‌ కూడా ఒకటి. అయితే ఈ ఉబర్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థల  నుంచి త్వరలో మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై నగరంలో ఉబర్‌  బస్సు సేవలను ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకి ఎక్కడంటే..

ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థలో ఉబర్‌ కూడా ఒకటి. అయితే ఈ ఉబర్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థల  నుంచి త్వరలో మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై నగరంలో ఉబర్‌  బస్సు సేవలను ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకి ఎక్కడంటే..

దేశంలో రవాణా వ్యవస్థ చాలా ప్రధానమైనది.ఇక ప్రస్తుత కాలంలో ప్రజల అవసరాల మేరకు ఈ రవాణా రంగం అనేది మరింత అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ఈ ప్రజా రవాణాలో వివిధ రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. రైళ్లు, విమానాలు, ప్రయివేట్ ట్యాక్సీలు, ఆటోలు, బైక్‌లే కాకుండా.. ప్రధాన నగరాల్లో ఇప్పుడు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక వాటితో పాటు ఉబర్, ఓలా వంటి సంస్థలు క్యాబ్‌లకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉబర్‌ బస్సులను కూడా నడపాలని నిర్ణయించుకుంది. కాగా, అందుకు ప్రయోగాత్మకంగా గతేడాది ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. అయితే ఇది పూర్తి స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఇప్పుడు ఆ నగరాల్లో కూడా ఉబర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇంతకి ఎక్కడంటే..

ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థలో ఉబర్‌ కూడా ఒకటి. అయితే ఈ ఉబర్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థల  నుంచి త్వరలో మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై నగరంలో ఉబర్‌  బస్సు సేవలను ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అయితే  తొలుత ఈ సేవలను దేశ రాజధాని ఢిల్లీలో  ప్రారంభించనుంది. కాగా, ఢిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్ పేరుతో ఈ బస్సులను నడపనుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ నుంచి ఆ సంస్థ లైసెన్స్‌‌ను కూడా అందుకుంది. ఇక ఇటువంటి లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీనే కాగా,  దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలవడం గమన్హారం.

అయితే ఉబర్‌ ఇండియా చీఫ్‌ అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఏడాదిగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు కోల్‌కతా నగరంలోనూ ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపామని, అలాగే ఢిల్లీలో తమ బస్సులకు చాలా ఆదరణ, డిమాండ్ ఉందని తెలిపారు. దీంతో అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. అయితే కోల్‌కతాలో బస్సు సర్వీసుల కోసం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వంలో ఏడాది కిందట అవగాహన ఒప్పందం చేసుకున్నామని అమిత్ దేశ్‌పాండే పేర్కొన్నారు.

ఇక ప్రయాణికులు వారం రోజుల ముందు నుంచే ఈ బస్‌ టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చని ఉబర్‌ తెలిపింది. అలాగే బస్సు వేళలు, లైవ్‌ లొకేషన్‌, అది ప్రయాణించే మార్గం గురించి ఎప్పటికప్పుడు ఉబర్‌ యాప్‌లో తెలుసుకోవచ్చని వివరించింది. అంతేకాకుండా.. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని,  ఉబర్‌ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఉబర్‌ వెల్లడించింది.

Show comments