వీడియో: చదువు నేర్పాల్సిన కాలేజీలో.. ఇలాంటి డ్యాన్స్‌లా? ఈ ఘోరం ఎక్కడంటే?

పాఠశాలలు, కళాశాలలు అనేవి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి. అయితే ఇప్పుడు ప్రతిభతో పాటు ఎగస్ట్రా వెర్రిక్యులర్ యాక్టివిటీస్ ని కూడా బయటకు తీయిస్తున్నారు. స్కూల్స్ లో, కాలేజీల్లో ఆడపిల్లలతో ఐటం సాంగ్స్ కి డ్యాన్సులు వేయించడం.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేయించడం.. వంటివి చేయిస్తున్నారని ఓ వర్గం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాలేజీలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ విషయంలోనూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలు, కళాశాలలు అనేవి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి. అయితే ఇప్పుడు ప్రతిభతో పాటు ఎగస్ట్రా వెర్రిక్యులర్ యాక్టివిటీస్ ని కూడా బయటకు తీయిస్తున్నారు. స్కూల్స్ లో, కాలేజీల్లో ఆడపిల్లలతో ఐటం సాంగ్స్ కి డ్యాన్సులు వేయించడం.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేయించడం.. వంటివి చేయిస్తున్నారని ఓ వర్గం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాలేజీలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ విషయంలోనూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో కలుస్తారు. దాని పేరే కాలేజ్ అని అంటారు. కాలేజ్ అన్నాక ఫ్రెషర్స్ డే పార్టీలు మామూలే. తమ కాలేజీలో కొత్తగా చేరిన జూనియర్స్ కి సీనియర్స్ ఫ్రెషర్స్ పార్టీ ఇస్తుంటారు. ఈ క్రమంలో జూనియర్స్ తో డ్యాన్సులు, పాటలు, స్కిట్స్ వంటి వినోదాత్మక ప్రోగ్రామ్స్ చేయిస్తారు. జూనియర్స్ డ్యాన్సులు వేయడం పాటలు పాడడం, స్కిట్స్ తో నవ్వించడం వంటివి చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని కాలేజీల్లో ఫ్రెషర్స్ డే పార్టీల్లో రొమాంటిక్ సాంగ్స్, ఐటం సాంగ్స్ వంటివి చేయిస్తున్నారు. అమ్మాయిలు కూడా ఎక్కడా సిగ్గు పడకుండా అబ్బాయిలతో కలిసి చేస్తున్నారు. అలానే బెల్లీ డ్యాన్సులు కూడా చేస్తున్నారు.

బెల్లీ డాన్స్ అంటే నడుముని స్ప్రింగ్ లా ఊపుతూ డాన్స్ చేస్తారు. నడుముతో పాటు శరీరంలో ఉండే అవయవాలు అన్నీ ఒక క్రమపద్ధతిలో కదులుతుంటాయి. అయితే అవి క్రమం తప్పుతున్నాయని భావించే కొందరు మాత్రం మాకిదేం కర్మ అని అనుకుంటారు. తాజాగా ఓ కాలేజీ అమ్మాయి చేసిన బెల్లీ డ్యాన్స్ విషయంలో నెటిజన్స్ ఇలానే రియాక్ట్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని డాంకౌర్ లో యమునా ఎక్స్ ప్రెస్ హైవే మీద ఉన్న గల్గోటియాస్ యూనివర్సిటీలో ఇటీవల ‘ఫ్రెషర్స్ ఫెస్ట్ 2024’ పేరుతో ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఒక అమ్మాయి సినిమా పాటలకు డ్యాన్సులు వేసింది. ఇందులో బెల్లీ డ్యాన్స్ ని మిక్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పబ్బులో ఉండే గబ్బుని చదువుల తల్లి సరస్వతి కొలువైయున్న కళాశాలలోకి తీసుకొస్తారా అంటూ మండిపడుతున్నారు.

ఒక పది మంది చుట్టూ కూర్చుని ఉంటే మధ్యలో ఒక అమ్మాయి ఇలా బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఆడుతూ ఉంటుంది. వాళ్ళు వేశారంటే పొట్ట కూటి కోసం అనుకోవచ్చు. కానీ కాలేజ్ అమ్మాయి వేయడం ఏంటి? తల్లిదండ్రులకు అవమానకరం కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పబ్స్ లోనో, ఎడారి ప్రాంతాల్లో ఉండే జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి వేసే డ్యాన్స్ ని చదువుకునే చోట ఎలా వేయిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా టాలెంట్ ని వెలికితీయడం అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బెల్లీ డ్యాన్సులు, పోల్ డ్యాన్సులు ఇలాంటివి కాలేజీల్లో వేయిస్తూ పబ్లిక్ కి, పేరెంట్స్ కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మాయిని ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆటవస్తువులా చూపిస్తారు అని మండిపడుతున్నారు. చదువు నేర్పే గురువులే ఇలాంటివి దగ్గరుండి ప్రోత్సహిస్తే కాలేజీలు పబ్బులుగా మారతాయని.. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ఖండించాలని.. ఏ విష సంస్కృతిని అనుమతించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. మరి కాలేజీలో అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేయడంపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

Show comments