iDreamPost
android-app
ios-app

వీడియో: పిల్లలతో విసనకర్రలతో విసిరించుకుంటూ.. క్లాస్​రూమ్​లోనే నిద్రపోయిన టీచర్!

  • Published Jul 27, 2024 | 10:37 PMUpdated Jul 27, 2024 | 10:37 PM

Teacher Sleeping Inside Class: చదువు చెప్పాల్సిన టీచర్.. అది మానేసి పిల్లలతో చాకిరీ చేయించుకుంది. ఎంచక్కా క్లాస్​రూమ్​లోనే కునుకు తీసింది.

Teacher Sleeping Inside Class: చదువు చెప్పాల్సిన టీచర్.. అది మానేసి పిల్లలతో చాకిరీ చేయించుకుంది. ఎంచక్కా క్లాస్​రూమ్​లోనే కునుకు తీసింది.

  • Published Jul 27, 2024 | 10:37 PMUpdated Jul 27, 2024 | 10:37 PM
వీడియో: పిల్లలతో విసనకర్రలతో విసిరించుకుంటూ.. క్లాస్​రూమ్​లోనే నిద్రపోయిన టీచర్!

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి బాలల భవిష్యత్​ను మెరుగ్గా తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులే. చదువు నేర్చుకోవాలని అనుకునే పిల్లలకు.. మంచి టీచర్లు దొరికితే దానికి మించిన ఆనందం ఉండదు. ఎంతో మంది చిన్నారులను బాగా చదివించి ఉన్నత స్థానాలకు చేర్చిన టీచర్లు ఉన్నారు. అందుకే సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి అంత గౌరవం ఉంది. కానీ కొందరు టీచర్లు మాత్రం ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతం తీసుకొని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పాఠాలు చెప్పకుండా టైమ్ పాస్ చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ టీచరమ్మ ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

చదువు చెప్పాల్సిన టీచరమ్మ ఎంచక్కా క్లాస్​రూమ్​లోనే కునుకు తీసింది. తరగతి గదిలో నిద్రపోవడమే గాక విద్యార్థులతో సపర్యలు చేయించుకుంది. ఎంచక్కా చిన్నారులకు విసనకర్ర ఇచ్చి విసిరించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో జరిగింది. అక్కడి ధానీపూర్ బ్లాక్, గోకుల్​పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇది చోటుచేసుకుంది. ఆ స్కూల్​లో ఒక మహిళా టీచర్ క్లాస్​రూమ్​లో చాప మీద నిద్రిస్తుండగా.. పిల్లలు ఆమెకు విసనకర్రతో విసురుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

చిన్నారులతో సపర్యలు చేయించుకున్న టీచరమ్మ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఘటన మీద స్థానికులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ చదువులు చెప్పకుండా పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తారా అని ఫైర్ అవుతున్నారు. టీచర్​కు ఇదేం పోయే కాలమని అంటున్నారు. చిన్నారులతో చాకిరీ చేయించుకున్న ఉపాధ్యాయురాలిని వదలొద్దని కామెంట్స్ చేస్తున్నారు. నలువైపుల నుంచి వస్తున్న విమర్శలతో ప్రభుత్వం ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవడం పక్కా అనిపిస్తోంది. మరి.. టీచర్ చదువు చెప్పకుండా పిల్లలతో విసనకర్రతో విసిరించుకున్న ఘటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి