nagidream
Satire On Budget- Man Shared A Video About How To Save 100 Percent Income Tax: ఎంత సంపాదించినా గానీ ఆదాయం మీద పన్ను అనేది చెల్లించాలి. అయితే చట్టంలోని కొన్ని సెక్షన్ల ద్వారా పూర్తిగా పన్ను చెల్లించకుండా వేరే మార్గాలు ఉన్నాయి. విరాళాలు ఇవ్వడం, ఛారిటీలకు సేవ చేయడం సహా అనేక మార్గాలు ఉన్నాయి. అయితే పూర్తిగా 100 శాతం పన్ను చెల్లించకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉంది అంటూ ఓ వ్యక్తి ఒక వీడియోను షేర్ చేశారు. అతను చెప్పినట్టు చేస్తే ఎంత సంపాదించినా గానీ పన్ను చెల్లించవలసిన పని లేదట.
Satire On Budget- Man Shared A Video About How To Save 100 Percent Income Tax: ఎంత సంపాదించినా గానీ ఆదాయం మీద పన్ను అనేది చెల్లించాలి. అయితే చట్టంలోని కొన్ని సెక్షన్ల ద్వారా పూర్తిగా పన్ను చెల్లించకుండా వేరే మార్గాలు ఉన్నాయి. విరాళాలు ఇవ్వడం, ఛారిటీలకు సేవ చేయడం సహా అనేక మార్గాలు ఉన్నాయి. అయితే పూర్తిగా 100 శాతం పన్ను చెల్లించకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉంది అంటూ ఓ వ్యక్తి ఒక వీడియోను షేర్ చేశారు. అతను చెప్పినట్టు చేస్తే ఎంత సంపాదించినా గానీ పన్ను చెల్లించవలసిన పని లేదట.
nagidream
సంపాదిస్తున్న ఆదాయం మీద ప్రభుత్వానికి పన్ను చెల్లించక తప్పదు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సంపాదిస్తున్నట్లైతే ఎవరైనా చెల్లించాల్సిందే. అయితే ఆ పన్ను ఎంత శాతం అనేది సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. అయితే చట్టంలోని కొన్ని సెక్షన్ల ద్వారా పన్ను ఆదా చేసుకునే వీలు కల్పిస్తూ వస్తుంది ప్రభుత్వం. అలా చూసినా గానీ పూర్తిగా పన్ను చెల్లించకుండా తప్పించుకునే వీలు లేదు. ఎంతో కొంత పన్ను అయితే చెల్లించాలి. అయితే అసలు పన్ను చెల్లించకుండా డబ్బు ఆదా చేసుకోవచ్చునని ఓ వ్యక్తి చెబుతున్నారు. అతను చెప్పినట్టు చేస్తే వందకు వంద శాతం పన్ను ఆదా చేసుకోవచ్చునని.. పూర్తిగా చట్టబద్ధమని అంటున్నారు. ప్రస్తుతం అతను చెప్పిన ట్రిక్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్స్, జోక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ‘శ్రీనిధి హాండే’ అనే కంటెంట్ క్రియేటర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జీతాలు సంపాదించే ఉద్యోగులు వందకు వంద శాతం పన్నును ఎలా ఆదా చేసుకోవాలో వెల్లడించారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘మీ ఇంట్లో లేదా బాల్కనీలో.. లేదంటే టెర్రస్ పైన గడ్డిని పెంచండి. మీరు పని చేసే సంస్థ హెచ్ఆర్ ని కలిసి జీతం ఇచ్చే బదులు మీ దగ్గర గడ్డి కొనమని చెప్పండి. మీ జీతం 50 వేలు అయితే దాని బదులు ఒక్కో గడ్డి కట్టను 1000 రూపాయల చొప్పున 50 గడ్డి కట్టలను అమ్మండి. ఇది పూర్తిగా చట్టబద్ధమే. ఎలాగూ మీరు జీతం తీసుకోరు. దానికి పన్ను పడదు. ఇక మీరు అమ్మే గడ్డి వ్యవసాయ ఉత్పత్తుల కిందకు వస్తుంది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు పన్ను లేదు. ఈ విధంగా మీరు వందకు వంద శాతం పన్ను ఆదా చేసుకోవచ్చు’ అంటూ శ్రీనిధి హాండే చెప్పుకొచ్చారు.
ఈ వీడియోను అఖిల్ పచోరి అనే చార్టెడ్ అకౌంటెంట్ షేర్ చేయగా.. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. కొంతమంది నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. మరికొంతమంది సీరియస్ అవుతున్నారు. గ్రాస్ (గడ్డి) సేలరీ అంటే ఇదా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది జీతం తీసుకునే ఉద్యోగులను అవమానించడమే అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. బడ్జెట్ పై వేసిన బెస్ట్ సెటైర్ వీడియో అని కొంతమంది భావిస్తున్నారు. బాగా కష్టపడి ఒక ఐదేళ్లు డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత సొంతూరికి పోయి పొలంలో వ్యవసాయం చేసుకుంటే ఇలాంటి పిప్పి పన్ను నొప్పులు, పురిటి నొప్పులు ఉండవని చాలా మంది ఉద్యోగులు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం చేసేవారు కరువైన నేపథ్యంలో వ్యవసాయం చేసేలా యువతను ప్రేరేపించడంలో భాగమే ఈ పన్ను భారం అని మరి కొంతమంది భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Salaried Class, this video is for you…
How to save 100% income tax 😂😂#Budget #Satire pic.twitter.com/UZBzuPNklV
— CA Akhil Pachori (@akhilpachori) July 25, 2024