CM కీలక నిర్ణయం! రేషన్‌ షాపుల్లో రూ.60కే కిలో టమాటా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు భారీ పెరిగిపోయాయి. చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కిలో టమాటా ధర రూ.120 నుంచి 200 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. తమ జీవితంలో ఇంత ధర ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ధర పెరుగుదల ఇలానే ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రజలు నిత్యం వంటలో వాడే టమాటాను కిలో రూ.60 రుపాయలకే రేషన్‌ షాపుల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన కూరగాయల ధర కారణంగా.. స్థానికంగా రేషన్‌ షాపుల్లో సబ్సిడీపై కిలో టమాటా రూ.60కే తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి సీఎం స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments