చూస్తుండగానే కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం..ఏడుగురు మృతి!

Surat Building Collapse: ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా ఎన్నో ప్రాంతాలు నీట మునిగిపోయాయి.. శిథిలావస్థలో ఉన్న భవనాలు నేలమట్టమయ్యాయి.

Surat Building Collapse: ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా ఎన్నో ప్రాంతాలు నీట మునిగిపోయాయి.. శిథిలావస్థలో ఉన్న భవనాలు నేలమట్టమయ్యాయి.

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచి కొట్టాయి.. ప్రజలు అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే జూన్ మాసం నుంచి వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు జలాశయాలు, కేనాల్స్, కుంటలు నిండి పొంగిపోర్లుతున్నాయి.లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా పాతభవనాలు కుంగిపోవడం, కుప్పకూలిపోవడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ లో ఆరంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ లో ఘోరం చోటు చేసుకుంది. సూరత్ లోని సచిన్ పాలి గ్రామంలో శనివారం ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. 2017 లో నిర్మించిన ఈ అపార్ట్ మెంట్ తొందరగానే శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో 30 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం ఐదు కుటుంబాలు మాత్రమే ఉంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భవనం నానిపోయింది. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం చూస్తుండగానే కుప్పకూలి నేలమట్టం అయ్యింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు.

సమాచారం తెలిసిన వెంటనే చోర్యాసీ శాసన సభ్యుడు సందీప్ దేశాయ్, సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌట్, జిల్లా కలెక్టర్ సౌరబ్ పార్థు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అగ్నిమాపక అధికారి బసంత్ పారిక్ శిథిలావస్థలు తొలగింపు, ఇతర రక్షణ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించి, క్షత గాత్రులను ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారు ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోయిన వారిలో సూరత్ లోని వస్త్ర పరిశ్రమలో పనిచేసే బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వారు అని ఎమ్మెల్యే సందీప్ దేశాయ్ తెలిపారు.

Show comments