క్యాన్సర్ తో కుడిచేయిని కోల్పోయినా.. 2 నెలల్లో పరీక్షకు సిద్ధం!

మనిషి సంకల్పం ముందు ఎంతటి అవరోధమైన చినబోవాల్సిందే. అలా ఎందరో తమకు ఎదురైన సమస్యలతో ధైర్యంగా పోరాడి విజయం సాధించారు. తాజాాగా ఓ కుర్రాడు..క్యాన్సర్ తో చేయిని కోల్పోయినా తాను అనుకున్నది సాధించాడు.

మనిషి సంకల్పం ముందు ఎంతటి అవరోధమైన చినబోవాల్సిందే. అలా ఎందరో తమకు ఎదురైన సమస్యలతో ధైర్యంగా పోరాడి విజయం సాధించారు. తాజాాగా ఓ కుర్రాడు..క్యాన్సర్ తో చేయిని కోల్పోయినా తాను అనుకున్నది సాధించాడు.

విజయం అనేది వినడానికి చాలా  సింపుల్ పదం. కానీ..దానిని సాధించాలంటే మాత్రం అంత ఆషామాషి కాదు. సంకల్పం బలంగా ఉంటేనే ఆ గెలుపు తీపిని ఎంజాయ్ చేయగలం. అలాంటి సక్సెస్ ను చాలా తక్కువ మంది మాత్రమే అందుకుని నలుగురి  ఆదర్శంగా ఉంటారు. అలానే కొందరు విధి తమపై చేసిన దాడిని సైతం ధైర్యంగా ఎదుర్కొని  నలుగురికి ఆదర్శంగా నిలబడతారు. అలానే క్యాన్సర్ తో చేయి కోల్పోయిన ఓ వ్యక్తి…. కేవలం2 నెల్లలో పరీక్షకు సిద్ధమై విజయం వైపు అడుగులు వేస్తున్నాడు.

క్యాన్సర్.. ఈ మహమ్మరి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక చాలా మంది తమకు క్యాన్సర్ ఉంది అని తెలిస్తే చాలు.. ఇక మానసికంగా కుంగిపోతుంటారు. ఇక తాము చనిపోతాము అనే  భావనతో తీవ్ర మనోవేదనకు గురవుతారు. ఇదే సమయంలో కొందరు క్యాన్సర్ పై పోరాడే విధానం మాములుగా ఉండదు. క్యాన్సర్ తమ శరీరానికే కానీ..తమ మనస్సుకు, తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి కాదని పట్టుదలతో ముందుకు వెళ్తుంటారు.  అలానే ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి సంకల్పం ఉన్నచోట అవరోధాలు కూడా చిన్నబోతాయని నిరూపించే ఘటన ఒకటి చోటుచేసుకుంది.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాకు చెందిన శుభజిత్‌ బిస్వాస్‌ (16) పదో తరగతి చదువుతున్నాడు.  అతడి అమ్మానాన్నలు రోజువారీ కూలీ పనులు చేసుకింటూ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అలా వారికి వచ్చే డబ్బులతో ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంలో అనుకోని ఘటన సమస్య ఒకటి వచ్చి పడింది. దీంతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయింది. కొన్నేళ్ల క్రితం శుభజిత్ కుడి చేతిపై చిన్న కణితి ఏర్పడింది. అది క్యాన్సర్  అని వైద్యులు గుర్తించారు. చికిత్స చేస్తే..బాలుడి  పరిస్థితి మెరుగు పడుతుందని వైద్యులు తెలిపారు.

చికిత్స కోసం శుభజిత్ తల్లిదండ్రులు చాలా డబ్బులో ఖర్చు చేశారు. అయినా వారి కష్టానికి ఫలితం లేకుండ పోయింది.  చివరకు గతేడాది డిసెంబరులో శుభజిత్ కుడిచేతిని తొలగించారు. ఇలా అతడి క్యాన్సర్ కారణంగా వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ప్రస్తుతం శుభజిత్ పదో తరగతి చదువుతున్నాడు. ఆర్థికంగా కుటుంబం నుంచి సహకారం లేదు.. అయినా కూడా అతడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఈ నెలలో తొలివారం నుంచి జరిగే పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యాడు. కేవలం 2 నెలల వ్యవధిలో ఎడమచేతితో రాయడం సాధన చేశాడు. చివరకు తనకు రాయడం అలావాటు అయినా కుడి చేయి మాదిరిగానే ఎంతో చలాకిగా ఎడమ చేయితో కూడా రాయడం మొదలు పెట్టాడు. అలానే ఎవరి సహయం లేకుండా ఇపుడు పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు.

ఇక శుభజిత్‌ పట్టుదల, కృషిని స్థానికులు, ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి శుభజిత్ మాట్లాడుతూ..చేతిని కోల్పోయినప్పుడు ఎంతో బాధ కలిగిందని, పరీక్షల కోసం ఎడమచేత్తో రాయడం సాధన చేశానని తెలిపాడు. తొలుత కష్టంగా అనిపించిందని, పలుమార్లు ప్రయత్నించినా చక్కగా రాయలేకపోయినందుకు ఎంతో బాధపడ్డానని తెలిపాడు. చివరకు ధైర్యాన్ని కూడగట్టుకుని నేను చేయగలను అనుకొని ముందుకుసాగారు. రెండు నెలల ప్రాక్టీస్ తర్వాత ప్రస్తుతం వేగంగా రాయగలుగుతున్నానని శుభజిత్‌ తెలిపాడు. మరి.. శుభజిత్ పట్టుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments