Venkateswarlu
Venkateswarlu
గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానంలో ఉండే వాడు. తల్లిదండ్రులు మనకు పుట్టుకను ఇస్తే.. గురువులు మనకు విద్యాబుద్దులు నేర్పి మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దుతారు. అయితే, విద్యార్థులకు తప్పు ఒప్పులు నేర్పి సన్మార్గంలో పెట్టాల్సిన గురువులే తప్పుదోవ పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన క్లాసులోని విద్యార్థులతో పేలు తీయించుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని సహార్ష జిల్లా, మక్దమ్‌పూర్‌లో ఇథరీ ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్లోని టీచర్ ఒకరు చదువు చెప్పటం మానేసి.. క్లాసులోని విద్యార్థులతో చెత్త చెత్త పనులు చేయిస్తున్నాడు. క్లాసు చెప్పాల్సిన సమయంలో వారితో తలకు మసాజ్‌లు చేయించుకుంటున్నాడు. అంతేకాదు! విద్యార్థులతో తల్లో పేలు కూడా తీయించుకుంటూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేస్తామని అన్నారు. ఇక, వైరల్‌గా మారిన 1.20 నిమిషాల వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉత్తర భారత దేశంలో జరుగుతూ ఉంటాయి’’.. ‘‘ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పటం మానేసి.. తల్లో పేలు తీయించుకుంటున్న ఈ టీచర్‌ను ఊరికే వదిలేయకూడదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.