వీడియో: క్లాస్ రూంలో ఊడిపడ్డ సీలింగ్ ఫ్యాన్.. విద్యార్థినికి గాయాలు

వీడియో: క్లాస్ రూంలో ఊడిపడ్డ సీలింగ్ ఫ్యాన్.. విద్యార్థినికి గాయాలు

క్లాస్ రూంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో క్లాస్ జరుగుతుండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థులపై పడింది. ఈఘటనలో ఓ విద్యార్థిని గాయాలపాలైంది.

క్లాస్ రూంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో క్లాస్ జరుగుతుండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థులపై పడింది. ఈఘటనలో ఓ విద్యార్థిని గాయాలపాలైంది.

ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. హఠాత్తుగా జరిగే ప్రమాదాల కారణంగా తీవ్ర గాయాలపాలవ్వడమో లేదా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడమో జరుగుతూ ఉంటుంది. ఇటీవల సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి పలువురు గాయపడిన ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో క్లాస్ రూంలో క్లాస్ జరుగుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనతో విద్యార్ధులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని గాయాలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే ఈ రోజు కూడా పాఠశాల ప్రారంభమైంది. విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యారు. ప్రైమరీ క్లాస్ కు చెందిన ఓ తరగతి గదిలో క్లాస్ ప్రారంభమైంది. టీచర్ విద్యార్థులకు లెస్సన్ చెప్పడం స్టార్ట్ చేసింది. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థులపై పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని గాయపడింది. దీంతో విద్యార్థులంతా భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీచర్ గాయపడిన విద్యార్థిని వద్దకు వెళ్లి సిబ్బంది సాయంతో ఆసుపత్రికి తరలించారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల కొరత కాణంగా, నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చూస్తుంటాము. కానీ ప్రైవేట్ పాఠశాలల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ క్లాస్ రూంలలో ఫ్యాన్లు కూడా సరిగా ఏర్పాటు చేయని స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments