P Krishna
Tamilnadu: తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి మనకు నడక నేర్పిస్తాడు.. జీవితాంతం వెన్నంటి ఉంటాడు. తమ పిల్లలు వృద్దిలోకి వచ్చి తమ ఇష్టాలను నెరవేరిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించలేం. ఓ కొడుకు తన తండ్రికి ఇచ్చిన బహుమతులు చూసి ఉప్పొంగిపోయాడు.
Tamilnadu: తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి మనకు నడక నేర్పిస్తాడు.. జీవితాంతం వెన్నంటి ఉంటాడు. తమ పిల్లలు వృద్దిలోకి వచ్చి తమ ఇష్టాలను నెరవేరిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించలేం. ఓ కొడుకు తన తండ్రికి ఇచ్చిన బహుమతులు చూసి ఉప్పొంగిపోయాడు.
P Krishna
తల్లిదండ్రులు తమ బిడ్డలు సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఎన్ని కష్టాలు పడైనా సరే పిల్లలను మంచి చదవు చెప్పించి ఉన్నత హోదాలో ఉండాలని తాపత్రపడుతుంటారు. అందుకోసం తమ సంతోషాల్ని సైతం పక్కనబెట్టి పిల్లల బంగారు భవిష్యత్ బాటలు వేస్తుంటారు. తాము కన్న కలనెరవేరుస్తూ పిల్లలు ఉన్నస్థితికి వస్తే ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు ఉండవు.తన జీవితం మొత్తం కుటుంబం కోసం కష్టపడ్డ ఓ తండ్రికి కొడుకు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతులు ఇచ్చి సంతోష పెట్టాడు. తన కోరిక గుర్తించి కొడుకు ఇచ్చిన బహుమతులు చూసి ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే..
తన కుటుంబ పోషణ కోసం సైకిల్ పై తిరిగి ఖర్జూరం అమ్ముతూ, పాతసామన్ల దుకాణం నిర్వహిస్తూ కష్టపడి తనను చదివించి గొప్ప స్థాయికి తీసుకువచ్చిన తండ్రికి సర్పైజ్ ఇవ్వాలనుకున్నాడు కొడుకు. పుట్టిన రోజు సందర్భంగా తండ్రికి 2.5 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు కొడుకు. తండ్రికి అంత ఖరీదైన కారు, వాచ్ ఎందుకు బహుమతిగా ఇచ్చాడు? దీనికి వెనుక ఏదైనా కారణం ఉందా? అన్న దానిపై ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పాడు కొడుకు బాలా సింగ్. తమిళనాడులో 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మేము 42 ఏళ్లుగా ఓ స్టోర్ నడిపిస్తున్నాం. మా నాన్న 14 ఏళ్ల వయసు నుంచి పనులు చేయడం ప్రారంభించారు. టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలు పెట్టారు. అందుకోసం సైకిల్ పై వీధుల్లో తిరుగుతూ ఇనుప సామాన్లకు ఖర్జూరం తూకం వేసి ఇచ్చేవాడు. నాన్న స్వస్థలం తిరునెల్వేలికి సమీపంలోని కోపిసేటిపాళయం. ప్రతిరోజూ 40 కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యాపారం చేసేవాడు. అమ్మ చనిపోయిన 22 ఏళ్లు అవుతుంది. నాన్న మరో పెళ్లి చేసుకోకుండా నన్ను, చెల్లిని పెంచి పోషించి అవివాహితుగా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి మంచి చెప్పులు, వాచ్, కారులో తిరగాలనే కోరిక నాన్నకు ఉండేది.. అది గుర్తుంచుకోని ఆయన పుట్టిన రోజుకు ఖరీదైన చెప్పులు, రోలెక్స్ వాచ్, బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చి సంతోష పెట్టాను.
కొడుకు ఇచ్చిన బహుబతి గురించి తండ్రి జగన్నాథన్ మాట్లాడుతూ..‘ నా కొడుకు ఇంత ఖరీదైన బహుమతులు ఇస్తాడని ఊహించలేదు. నేను ప్రతిరోజూ 1 రూపాయి దాచి ఉంచుతాను.. దాని వల్ల ఎప్పుడైన ఉపయోగాలు ఉంటాయి. నా కొడుకు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు.. ఈ స్థాయిలో నన్ను సంతోష పర్చాడు. నా జీవితానికి ఇది చాలు’ అని అన్నాడు. ప్రస్తుతం తండ్రీ కొడుకులకు అనుబంధం చాటిచెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.