Arjun Suravaram
Adithya Nair: ప్రస్తుతం కాలంలో ట్రోలింగ్ అనేవి సాధారణమైనప్పటికి ..సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది యువత బలయ్యారు. తాజాగా కనీసం 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి కూడా బలైంది
Adithya Nair: ప్రస్తుతం కాలంలో ట్రోలింగ్ అనేవి సాధారణమైనప్పటికి ..సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది యువత బలయ్యారు. తాజాగా కనీసం 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి కూడా బలైంది
Arjun Suravaram
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. అంతేకాక మరికొందరు ఫేమస్ అయ్యేందుకు తెగ కష్టపడుతుంటారు. ఇది ఇలా ఉంటే..రీల్స్, వీడియో వంటివి చేసేవారే కాక.. ఇక్కడ ట్రోలర్స్ అనే మరో వర్గం ఉంటుంది. అంతేకాక నేటికాలంలో ట్రోలింగ్స్ అనేవి సాధారణంగా మారాయి. అయితే కొందరు శృతిమించి ట్రోలింగ్ చేస్తుంటారు. వీటి దెబ్బకు సున్నిత మనసులు కలిగిన వారు మానసికంగా కుంగిపోతుంటారు. కొందరు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ట్రోలర్స్ కారణంగా ఓ యువతి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాధ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం కాలంలో ట్రోలింగ్ అనేవి సాధారణమైనప్పటికి ..సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది యువత బలయ్యారు. గతంలో గీతాంజలి, రమ్య వంటి పలువురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. తాజాగా ఆదిత్య అనే యువతి ట్రోలర్స్ ధాటికి బలయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండటాన్ని ఆమె భరించలేక పోయింది. దీంతో నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆదిత్య ఆత్మహత్యకు పాల్పడింది.
కేరళ రాష్ట్రం తిరువనంతపురం పట్టణంలోని కున్నుపుజా ప్రాంతానికి చెందిన ఆదిత్య ఎస్ నాయర్(18) అనే యువతి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తనదైన వీడియోలతో ఫాలోవర్స్ ను బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో బినోయ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. మొత్తంగా ఆదిత్య నాయర్.. బినోవ్ ప్రేమలో పడింది. అప్పటి వరకు ఎవరికి వారే వీడియోలు చేసిన వీరిద్దరు..కలిసి వీడియోలు రీల్స్ చేసే వారు. అలా ఈ ఇద్దరూ యూట్యూబ్, ఇన్‌స్టా వీడియోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వచ్చారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రెండు నెలల క్రితం తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఇక అప్పటి నుంచి బినోయ్‌కు మద్దతు ఇస్తూ… ఆదిత్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి ఒక స్టేజ్ ధాటి మీమ్స్ వేసే వరకు వెళ్లాయి. చాలా కాలం పాటు వారి ట్రోల్స్ ను భరించిన ఆదిత్య..లోలోపల మానసికంగా కుంగిపోయింది. చివరకు ఇక తనపై ట్రోల్స్ ను భరించలేక జూన్ 10న ఉరేసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిత్యను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం ఆదిత్య కన్నుమూసింది. దీంతో అప్పటిదాకా ట్రోల్ చేసిన మీమర్లే.. తిరిగి సంతాపంత తెలుపుతూ పోస్టులు వేస్తూ వస్తున్నారు. దీంతో ఇలాంటి ట్రోలర్స్ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.