ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్‎

Shalimar Super Fast Express: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

Shalimar Super Fast Express: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

రైలు ప్రయాణికులను వరుస రైలు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ట్రైన్ జర్నీ అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ప్రమాదాల నివారణకు రైల్వే డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొట్టడం, రైళ్లలో అగ్నిప్రమాదాలు రైలు ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టెక్నికల్ సమస్యలతో, మానవ తప్పిదాలతో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోవడం, వైకల్యానికి గురవుతున్నారు.

రైలు ప్రమాదాల కారణంగా బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటున్నది. ఆధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా రైలు ప్రమాదాలకు కళ్లెం పడడం లేదు. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‎ప్రెస్ నవంబర్ 9 (శనివారం) నల్పూర్‌లో పట్టాలు తప్పింది.సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో షాలిమార్ ఎక్స్ ప్రెస్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.

గట్టిగా కేకలు వేస్తూ ట్రైన్ దిగి పరుగులు తీశారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో పలువురు ప్యాసింజర్స్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ప్యాసింజర్స్ ను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక కుట్ర కోణం ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా షాలిమార్ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలంలో రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తొలగించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. రైళ్లు యధావిధిగి నడిచేందుకు పనులు వేగవంతం చేశారు. ఇటీవల రైల్వే ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్స్, సిమెంట్ దిమ్మెలు, ఐరన్ పోల్స్ ఉంచి విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఈ ఘటనలతో రైలు ప్రయాణికుల్లో అభద్రతాభావం ఏర్పడింది. మరి సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments