Tirupathi Rao
Tirupathi Rao
సాయిబాబా దేవుడు కాదని.. హిందువులు ఆయన గుడికి వెళ్లకూడదని.. ఇంట్లో ఉన్న ఫొటోలను బయట పారేయాలంటూ శంభాజీ భిడే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారమే రేపుతున్నాయి. హిందువులు చాలా మంది సాయిబాబాను పూజిస్తారని.. అసలు ఆ పూజలకు నిజంగా ఆయన అర్హుడేనా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని శింభాజీ భిడే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను భాద్యతగా చెబుతున్నాన్నారు.
మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన శింభాజీ భిడే అందరికీ తెలిసే ఉంటారు. మహారాష్ట్రకు చెందిన ఈ హిందూత్వ అనుకూల నేత మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి సాయిబాబాను ఉద్దేశించి శిభాజీ బిడే సంచలన వ్యాఖ్యలు చేశారు. “హిందువులు మొదట సాయిబాబా ఫొటోలు, విగ్రహాలను మీ ఇంట్లో నుంచి తొలగించాలి. నేను మానసికంగా బాగానే ఉన్నాను. మీ అందరికీ ఈ విషయాన్ని నేను ఒక బాధ్యతగా చెబుతున్నాను. సాయిబాబాను దేవుడిగా పూజించకూడదు. మీరు పూజించేందుకు అసలు ఆయన అర్హుడో కాదో చూసుకోండి” అంటూ శంభాజీ భిడే వ్యాఖ్యానించారు. ఇటీవల మహాత్మా గాంధీ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం చూశాం.
అసలు గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ కాదంటూ చెప్పారు. మహాత్మా గాంధీ ఒక ముస్లిం భూస్వామి కుమారుడు అంటూ వ్యాఖ్యానించారు. కరంచంద్ గాంధీ ఒక ముస్లిం భూస్వామి వద్ద పనిచేసేవారని.. ఒకరోజు నగదు దొంగిలించి పారిపోయాడన్నారు. ఆ తర్వతా కరంచంద్ గాంధీ భార్యను ఆ ముస్లిం భూస్వామి తన ఇంటికి తీసుకెళ్లారని అన్నారు. అలా మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్దఎత్తున చర్చకు, విమర్శలకు తెర లేపింది. శంభాజీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు శింభాజీ భిడే వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రముఖలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం చల్లారకముందే శింభాజీ భిడే సాయిబాబా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో కూడా శింభాజీ భిడే వార్తల్లో నిలిచారు