SNP
SNP
పురాణ గాథలు, ఇతిహాసాలకు సంబంధించిన చాలా విషయాలు మన దేశంలోని అనేక ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. ఆ ప్రాంతంలో రాయుడు సంచరించాడని, ఇక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడని చాలా మంది చెబుతుంటారు. వినేందుకు కొన్ని వింతగా ఉన్నా.. వాటి వెనుక ఉన్న ఆధారాలు, ప్రజల విశ్వాసంతో కొన్నేళ్లు అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వింత విషయాల్లో ఒకటి బైద్యనాథ్‌లోని చెరువు. ఈ చెరువు రావణ బ్రహ్మ మూత్రం పోస్తే ఏర్పడిందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ చెరువులోని చుక్క నీటిని కూడా వాడరు.
జార్ఖండ్ రాష్ట్రంలోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ గుడికి సమీపంలోనే రెండు చెరువులు ఉన్నాయి. అందులోని ఒక చెరువు గురించి ఈ వార్త. రామాయణం జరగడానికి ముందు మహాశివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు తీసుకెళ్లేందుకు రావణుడు ప్రయత్నించాడు. రావణుడు శివుడికి పరమ భక్తుడనే విషయం తెలిసిందే. కానీ ఆ భక్తి కొన్నిసార్లు శివుడికే చిరాకు తెప్పించేదని ఆలయ స్థల పురాణంలో ఉంది. అలాగే రావణాసురుడి మొండితనం గ్రహించిన మహాశివుడి.. అతను తీసుకెళ్తున్న శివలింగాన్ని ఎక్కడా దించకుండా లంకు తీసుకెళ్లాలని, అలా కాకుండా ఎక్కడైనా ఆగి, లింగాన్ని కింద పెడితే.. అక్కడే అది ప్రతిష్ఠ అవుతుందని, అక్కడి నుంచి దాన్ని ఎవరూ కదిలించలేరని శివుడు.. రావణుడికి ఆంక్ష పెడతాడు.
కానీ, పోయే దారిలో రావణుడికి మూత్రం రావడంతో ఆగాల్సి వస్తుంది. శివలింగాన్ని లంకకు తరలించడం ఇష్టంలేని విష్ణుమూర్తి బాలుడి వేషంలో అక్కడి వస్తాడు. మూత్రం పోసుకోవడానికి రావణుడు లింగాన్ని బాలుడికి ఇచ్చి.. మూత్రం పోసుకునేందుకు వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి అక్కడ బాలుడు ఉండడు. శివలింగ నేలపై ఉంటుంది. శివుడి షరతు ప్రకారం ఆ శివలింగాన్ని రావణుడు అక్కడి నుంచి తీసుకెళ్లలేకపోతాడు. దీంతో అక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. కాల క్రమంలో అదే శివాలయంగా మారింది. అయితే.. రావణుడు పోసిన మూత్రంతోనే అక్కడికి సమీపంలో ఒక చెరువు ఏర్పడిందని ఆలయ స్థల పురాణంలో ఉంది. అందుకే ఆ చెరువులోని నీటిని స్థానికులు గానీ, ఆలయానికి వచ్చేవారు కానీ అస్సలు తాకరు. ఏ పనికి కూడా ఆ చెరువు నీటిని వాడరు. మరి ఈ వింత చెరువుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.