iDreamPost
android-app
ios-app

సరదా తీర్చిన ఆన్ లైన్ గేమ్స్.. ఏకంగా రూ. 96 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

  • Published Sep 27, 2024 | 4:05 PM Updated Updated Sep 27, 2024 | 4:05 PM

Online Gaming addiction: ఆన్ లైన్ మోసాల గురించి ఎంత అధికారులు యువతను ఎంత హెచ్చరించిన సరే.. ఇంకా వీటి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆన్ లైన్ గేమ్స్ ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.96 లక్షలను పోగట్టుకున్నాడు ఓ యువకుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Online Gaming addiction: ఆన్ లైన్ మోసాల గురించి ఎంత అధికారులు యువతను ఎంత హెచ్చరించిన సరే.. ఇంకా వీటి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆన్ లైన్ గేమ్స్ ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.96 లక్షలను పోగట్టుకున్నాడు ఓ యువకుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 27, 2024 | 4:05 PMUpdated Sep 27, 2024 | 4:05 PM
సరదా తీర్చిన ఆన్ లైన్ గేమ్స్.. ఏకంగా రూ. 96 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

ఫేక్ కాల్స్ చేసి బెదిరించడం , నమ్మించి మోసం చేయడం.. మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేయడం.. ఇలా ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక వీటిలో ముఖ్యంగా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి.. వేలల్లో.. లక్షల్లో డబ్బులు పోగొట్టున్నారు ప్రజలు. ఆన్ లైన్ మోసగాళ్లకు యువతే టార్గెట్. గత కొంతకాలంగా యూత్ అంతా ఆన్లైన్ గేమ్స్ కు బానిస అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నాము. అధికారులు దీని పట్ల ఎన్ని చర్యలు తీసుకున్నా .. యువతను ఎంత హెచ్చరించినా.. ఇంకా పలు చోట్ల ఈ ఆన్లైన్ మోసాల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ సంఘటనకు యావత్ దేశమే ఉలిక్కిపడింది. ఆన్ లైన్ గేమ్స్ ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.96 లక్షలను పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఆల్రెడీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసే ఉంటారు. జార్ఖండ్ కు చెందిన హిమాన్షు మిశ్రా అనే 22 ఏళ్ళ యువకుడు.. ఎక్కువగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇలా గేమ్స్ ఆడుతున్నాడు కదా సదాసీదా మనిషి అనుకుంటే పొరపాటే స్టడీస్ లో ఇతను టాప్ స్టూడెంట్.. ఐఐటీ జేఈఈ లో ఏకంగా 98 శాతం మార్కులను సాధించాడు. కానీ ఈ ఆన్ లైన్ గేమ్స్ ఇతని జీవితాన్ని ఒక్కసారిగా చిన్న భిన్నం చేశాయి. అతని బంగారు భవిష్యత్తుని రోడ్డున పడేశాయి. డ్రీమ్-11, మహాదేవ్ యాప్ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌లో .. మొదట సరదాగానే గేమ్స్ ను స్టార్ట్ చేసిన అతనికి క్రమంగా అది వ్యసనంగా మారింది. కేవలం రూ. 49తో మొదలు పెట్టి క్రమంగా బెట్టింగ్‌ను పెంచుకుంటూ పోయాడు ఈ యువకుడు. తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కోసం ఇచ్చిన డబ్బును కూడా గేమ్స్ లో పెడుతూ ఉండేవాడు.. అలా స్నేహితులు , బంధువులు అలా ఎవరు దొరికితే వారి వద్ద అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే సుమారు రూ.96 లక్షల రూపాయలను ఆన్లైన్ గేమ్స్ ద్వారా పోగొట్టుకున్నాడు.

ఇతని వ్యసనం కారణంగా అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితి చిన్నా భిన్నం అయింది. ఇప్పటికి కొంతవరకు అప్పులు తీరినా కానీ… అతని కుటుంబం అతనిని ఇంటి నుంచి పంపించేశారు. తాజాగా యూట్యూబర్ షాలిని కపూర్ తివారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇలా పలు అంశాల గురించి చెప్పుకొచ్చాడు. అతను ఎలా మోసపోయానని చెప్పిన విధానం అందరిని ఆలోచింపజేసింది. ఇలా ఇంకా ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారు ఎవరైనా ఉంటే.. ఈ వీడియో చూసి ఇప్పటికైనా మేల్కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆన్ లైన్ లో గేమ్స్ అనేవి కచ్చితంగా 100 శాతం ఫేక్ ఉంటాయి. ఎక్కడో ఎవరో కంటికి కనిపించని వ్యక్తి.. మీడ డబ్బును అడుగుతున్నాడంటే.. అది కచ్చితంగా మోసం చేస్తున్నట్లే అని గుర్తించాలి. కాబట్టి ఇక నుంచైనా ఈ ఆన్ లైన్ గేమ్స్ కు చెక్ పెట్టి.. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడం మంచిది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.